News January 2, 2026
ములుగు: ‘మావో’ దేవా లొంగుబాటు నిజమేనా!

మావోయిస్టు అగ్రనేత పువ్వర్తికి చెందిన బార్సే దేవా తన సహచరులతో లొంగిపోయినట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. దేవా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు చర్చ నడుస్తోంది. అయితే, దేవా బెటాలియన్ నెంబర్-1 కమాండర్‌గా ప్రస్తుతం కొనసాగుతున్నాడని, తనతో ఉన్న సుమారు 40 మంది క్యాడర్‌తో ములుగు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. కాగా, అధికారికంగా పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.
Similar News
News January 2, 2026
ఇబ్రహీంపట్నం: రెండోసారి కస్టడీకి జోగి బ్రదర్స్..

నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, రాములులను సిట్ అధికారులు శుక్రవారం మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు వీరిని విచారించనున్నారు. గతంలో ఇబ్రహీంపట్నంలో జరిగిన నకిలీ మద్యం తయారీ కేసులో వీరిని సిట్ విచారించింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరిని ఈ కేసులో పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరికి ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పించింది.
News January 2, 2026
రీ-సర్వే పూర్తయిన చోట్ల పాస్ పుస్తకాలు: జేసీ

భూ రీ-సర్వే పూర్తయిన చోట్ల రైతులకు పట్టాదారు ఈ-పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు. గుర్రంకొండ మండలం, సంగసముద్రంలో జరిగిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రీ సర్వే జరిగిన గ్రామాల్లో పట్టాదారు పాసు పుస్తకాలు ప్రభుత్వ చిహ్నంతో ముద్రించి ఇస్తున్నామన్నారు.
News January 2, 2026
అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దు: జిల్లా కలెక్టర్

రైతులు ఎవరు ప్రస్తుత అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దని రైతులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. భవిష్యత్తులో యూరియా దొరుకుతుందో లేదో అనే అనుమానంతో ప్రస్తుతం అధికంగా కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటే యూరియా యొక్క నాణ్యత దెబ్బ తిని పంట నష్టం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. యూరియా కోసం రైతులు ఏ సమయంలో రావాలో వారికి ముందస్తుగానే సమాచారం అందిస్తూ కూపన్లు కూడా జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.


