News December 18, 2025

ములుగు: ముఖ్య నేతల స్వగ్రామాల్లో గెలిచింది వీరే!

image

ములుగు జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన నేతల స్వగ్రామాల్లో ఇలా..
మంత్రి సీతక్క స్వగ్రామం జగ్గన్నపేటలో కాంగ్రెస్, జిల్లా అధ్యక్షుడు అశోక్ స్వగ్రామం చల్వాయిలో కాంగ్రెస్, బడే నాగజ్యోతి కాల్వపల్లి కాంగ్రెస్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు ఏటూరునాగారంలో బీఆర్ఎస్, మాజీ రెడ్కో ఛైర్మన్ సతీశ్ రెడ్డి దేవగిరిపట్నంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.

Similar News

News December 22, 2025

నాపై 109 కేసులున్నాయి కాబట్టే..: సంజయ్

image

ప్రజల కోసం చేసిన పోరాటాల వల్ల తనపై 109 కేసులు పెట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఓ మెడికల్ కాలేజీ వార్షికోత్సవంలో తెలిపారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు ఇన్ని కేసులున్నాయా? అని అమిత్ షాను అడిగారని గుర్తు చేశారు. ‘అందుకే సంజయ్ కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రి అయ్యారు’ అని షా బదులిచ్చారని పేర్కొన్నారు. వైద్యులు ఫార్మా కంపెనీలు, డయాగ్నోస్టిక్ సెంటర్ల వలలో పడి ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు.

News December 22, 2025

డిసెంబర్ 22: చరిత్రలో ఈ రోజు

image

✒ 1887: గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జననం (ఫొటోలో)
✒ 1899: ప్రముఖ వైద్యుడు శొంఠి దక్షిణామూర్తి జననం
✒ 1953: సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పాటు
✒ 2000: ఢిల్లీలోని ఎర్రకోటలోకి ప్రవేశించిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక పౌరుడిని హతమార్చారు
✒ 2015: నటుడు, రచయిత కాశీ విశ్వనాథ్ మరణం
✒ జాతీయ గణిత దినోత్సవం

News December 22, 2025

ATP: రైలు కింద పడి బీటెక్ విద్యార్థి మృతి

image

గుత్తి మండలం బసినేపల్లికి చెందిన సాయిరాజ్ (22) జంగాలపల్లి-ప్రసన్నాయిపల్లి రైల్వే స్టేషన్ మధ్య రైలు కిందపడి ఆదివారం మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ధర్మవరం రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతుడు అనంతపురం జేఎన్టీయూ కాలేజ్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడన్నారు. పోలీసులు విచారణ చేపట్టారు.