News April 2, 2025

ములుగు: ‘రజతోత్సవ సభను విజయవంతం చేస్తాం’

image

బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేస్తామని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. ఈరోజు హైదరాబాదులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రజతోత్సవ సన్నాహక సమావేశంలో వారు పాల్గొన్నారు.

Similar News

News April 3, 2025

MDK: కలెక్టర్ జాయిన్ చేసిన బాలిక అదృశ్యం..?

image

పాపన్నపేట కేజీబీవీ నుంచి బాలిక అదృశ్యమైంది. మెదక్ బాలసదనంలో అనాథగా ఉన్న ఓ బాలికను కలెక్టర్ తీసుకొచ్చి ఇటీవల పాపన్నపేట కేజీబీవీలో 8వ తరగతిలో జాయిన్ చేశారు. అయితే ఆ బాలికను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కేజీబీవీ అధికారులు మాత్రం కనీసం పట్టించుకోలేదు. తల్లిదండ్రులు ఎవరూ లేని ఒక విద్యార్థినిని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయగా అక్కడి నుంచి బాలిక వెళ్లిపోయినట్లు తెలిసింది.

News April 3, 2025

జిల్లాకు 4,549 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

image

జిల్లాలో 4,549 ఇందిరమ్మ ఇళ్ల మంజూరయ్యాయని కలెక్టర్ తేజస్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అర్హత ఉన్నవారికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జరిగిన పనుల వివరాలు, మిగిలిన నిధులను నివేదిక ద్వారా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

News April 3, 2025

సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం

image

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు వడివడిగా ఏర్పాట్లను పూర్తి చేశామని దేవస్థాన ఆలయ ఈవో ఎల్ రమాదేవి తెలిపారు. కరోనా తర్వాత శ్రీరామనవమి ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు, ఉన్నత అధికారులు, న్యాయమూర్తులు ఇతర ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

error: Content is protected !!