News December 21, 2025
ములుగు: రేపు పంచాయతీ పాలకవర్గాల పదవీ ప్రమాణం

నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గాలు రేపు (22న)పదవీ ప్రమాణం చేయనున్నాయి. 146 మంది సర్పంచ్/ఉప సర్పంచ్, 1290మంది వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించింది. అధికారం చేపట్టేందుకు ప్రతినిధులు ఆసక్తితో ఉన్నారు. ఆ వెంటనే ప్రత్యేక గ్రామసభలు ఏర్పాటు చేసి ఊరి సమగ్రాభివృద్ధికి యంత్రాంగం ప్రణాళిక రూపొందిస్తోంది.
Similar News
News December 22, 2025
ప.గో: చేపల వేటకెళ్లొస్తుండగా ప్రమాదం.. ఇద్దరి మృతి

కలిదిండి(M) మద్యానిగూడెం వంతెన వద్ద ఆదివారం బొలెరో బోల్తా పడిన ఆంజనేయులు (50), వెంకటేశ్వర్లు (52) <<18632614>>మృతి చెందిన సంగతి తెలిసిందే<<>>. చేపల వేట ముగించుకుని తిరిగి వస్తుండగా, ఎదురుగా వస్తున్న వ్యక్తిని తప్పించబోయి వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఆంజనేయులు కుమారుడు వెంకటకృష్ణ తీవ్రంగా గాయపడగా, చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ వి. వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 22, 2025
పెనమలూరు ORR రూట్ మ్యాప్ ఇదే.!

పెనమలూరు పరిధిలో ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్డు (ORR)తో అభివృద్ధి వేగవంతం కానుంది. కంకిపాడు-ఉయ్యూరు సరిహద్దులో 25 K.M మేర విస్తరించే ఈ భూసేకరణ కోసం సర్వే నంబర్‌ల గుర్తింపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. మారేడుమాక, కోలవెన్ను సహా 8 గ్రామాల్లో 778 కమతాలను గుర్తించారు. దావులూరు-నెప్పల్లి హైవేకు అనుసంధానంగా ఈ రూట్ ఏర్పాటు కానుంది. ORR విస్తరించే గ్రామాల్లో 1st దావులూరు చివరి స్థానంలో రొయ్యూరు ఉన్నాయి.
News December 22, 2025
పాలమూరులో నేడు కొత్త సర్పంచుల పట్టాభిషేకం.!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పాలనలో నూతన అధ్యాయం మొదలుకానుంది. ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 1,678 పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు నేడు ప్రమాణస్వీకారం చేస్తారు. MBNR 423, NGKL 460, GWL 255, WNP 268, NRPTలోని 272 గ్రామాల్లో సందడి నెలకొంది. అధికారుల సమక్షంలో ప్రజాప్రతినిధులు పాలనా పగ్గాలు చేపట్టేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.


