News February 6, 2025

ములుగు: రైతు భరోసా డబ్బులు జమ!

image

ములుగు జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమవుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఎకరం లోపు విస్తీర్ణం కలిగిన రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అయినట్లు రైతులు తెలిపారు. ఎకరం విస్తీర్ణానికి పైగా ఉన్న రైతులకు కూడా ఒకటి, రెండు రోజుల్లో భరోసా నిధులు జమవుతాయని ప్రభుత్వం వెల్లడించింది.

Similar News

News February 6, 2025

BREAKING: NZB: ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ ఆటో దగ్ధం

image

ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ ఆటో దగ్ధమైన ఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని ధర్మపురి హిల్స్‌కు చెందిన మొహమ్మద్ మొహియుద్దీన్ బుధవారం రాత్రి తన ఎలక్ట్రిక్ ఆటోను ఇంటి ఆవరణలో ఛార్జింగ్ పెట్టి ఇంట్లోకి వెళ్లాడు. గంట వ్యవధిలో ఒక్కసారిగా ఆటోలో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఎలక్ట్రిక్ ఆటో పూర్తిగా దగ్ధమైంది.

News February 6, 2025

విజయసాయి రెడ్డి రాజీనామాపై తొలిసారి స్పందించిన జగన్

image

AP: విజయ‌సాయి రెడ్డి రాజీనామాపై YS జగన్ తొలిసారి స్పందించారు. ‘మాకు 11 మంది రాజ్యసభ ఎంపీలుంటే సాయిరెడ్డితో కలిపి ఇప్పటివరకు నలుగురు వెళ్లిపోయారు. అయినా YCPకి ఏమీ కాదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. అది సాయిరెడ్డికైనా, ఇప్పటివరకు పోయినవారికైనా, ఇంకా ఒకడో, ఇద్దరో వెళ్లేవారికైనా అదే వర్తిస్తుంది. క్యారెక్టర్‌ను బట్టే ఉంటుంది. YCP కేవలం దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే నడుస్తుంది’ అని స్పష్టం చేశారు.

News February 6, 2025

వెయిట్ లిఫ్టింగ్‌కు పుట్టినిళ్లు ‘కొండవెలగాడ’

image

వెయిట్ లిఫ్టింగ్‌కు పుట్టినిల్లు కొండవెలగాడ తన పేరును సార్థకం చేసుకుంది. వల్లూరి శ్రీనివాసరావు, మత్స సంతోషి లాంటి సీనియర్ లిఫ్టర్లు ఈ గ్రామం నుంచే వెళ్లి కామన్ వెల్త్‌లో ఛాంపియన్స్‌గా నిలిచి దేశ ఖ్యాతిని ఖండాంతరాల్లో నిలిపారు. వాళ్లని ఆదర్శంగా తీసుకొని పదుల సంఖ్యలో క్రీడాకారులు గ్రామం నుంచి పుట్టుకొచ్చారు. తాజాగా జాతీయస్థాయిలో జరిగిన పోటీల్లో గ్రామానికి చెందిన శనపతి పల్లవి గోల్డ్ మెడల్ కొట్టింది.

error: Content is protected !!