News July 4, 2025

ములుగు రోడ్డు జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం

image

వరంగల్ ములుగు రోడ్ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ బస్సు టైరును వృద్ధుడి కాలుపై నుంచి పోనించడంతో పాదం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో గాయపడిన వృద్ధుడిని ల్యాదెళ్లకు చెందిన కొమురయ్యగా గుర్తించారు. వెంటనే అతడిని ట్రాఫిక్ పోలీసులు 108 అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించారు. ఆర్టీసీ బస్సును మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News July 4, 2025

రేపు స్కూళ్లకు సెలవు ఉందా? క్లారిటీ!

image

మొహర్రం పురస్కరించుకుని గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో శనివారం ఆప్షనల్, ఆదివారం పబ్లిక్ హాలిడే ప్రకటించారు. అయితే ఏపీలో రేపు స్కూళ్లకు రావాల్సిందేనని టీచర్లను అధికారులు ఆదేశించారు. పాఠశాలలోని 50% మంది టీచర్లు విధులకు రావాలని, పిల్లలకు యథావిధిగా క్లాసులు నిర్వహించాలని సూచించారు. అటు తెలంగాణలో రేపు హాలిడే ఉంటుందని మెసేజులు రాలేదు. మరి మీకు రేపు సెలవు ఇచ్చారా? కామెంట్ చేయండి.

News July 4, 2025

టెన్త్ విద్యార్థులకు బహుమతిగా సైకిళ్లు: బండి సంజయ్

image

TG: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టెన్త్ విద్యార్థులకు ప్రధాని మోదీ 20వేల సైకిళ్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈనెల 11న తన బర్త్‌డే సందర్భంగా 8, 9 తేదీల్లో వీటిని పంపిణీ చేస్తామన్నారు. KNR, SRCL, JGL, SDPT, HNK జిల్లాల్లోని విద్యార్థులకు వీటిని అందజేస్తామని తెలిపారు. ఒక్కో సైకిల్ ఖరీదు రూ.4వేలు అని, వాటిపై PM ఫొటో ఉంటుందని పేర్కొన్నారు.

News July 4, 2025

నిర్మల్: మైసంపేట్ పునరావాసంపై కలెక్టర్ దృష్టి

image

అటవీ చట్టాలను పాటిస్తూ గ్రామాలకు రహదారి, విద్యుత్, ఆరోగ్య సేవలు కల్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఈరోజు జిల్లా అటవీ కమిటీ సమావేశంలో ‘పరివేశ్’ పోర్టల్ ద్వారా అనుమతులు పొందాలని ఆమె సూచించారు. కడెం మండలంలోని మైసంపేట్‌ను పునరావాస గ్రామంగా అభివృద్ధి చేసి, ప్రతి కుటుంబానికి మనీ ప్యాకేజ్, అటవీ హక్కుల చట్టం కింద సాగు భూములకు పట్టాలు అందించే ప్రక్రియను ప్రారంభించామని పేర్కొన్నారు.