News February 27, 2025

ములుగు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. మంగపేటకు చెందిన బొల్ల ప్రసాద్ శివరాత్రి సందర్భంగా రామప్ప ఆలయానికి వెళ్లాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తిరిగి వస్తున్న క్రమంలో తాడ్వాయి జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా పలువురుకి గాయాలైనట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 19, 2025

HYD: ఇరిగేషన్ అనుమతులు ఇంకెప్పుడు?

image

HYD శివారు ప్రతాపసింగారంలో రైతులు 131 ఎకరాలు LPS కింద ప్రభుత్వానికి ఇచ్చారు. ఇందులో HMDA లేఅవుట్ వేసి రైతులకు- HMDAకు 60:40 నిష్పత్తిలో పంపిణీ చేయనుంది. అయితే భూమి ఇచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా ఇరిగేషన్ శాఖ అనుమతులు రాలేదు. ఇటీవల సీఎం రేవంత్ అధికారులను హెచ్చరించిన వారిలో చలనంలేదు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చినా అనుమతులు నిలువరించడంపై రైతులు మండిపడుతున్నారు. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

News September 19, 2025

ADB: పత్తి కొనుగోళ్లకు కొత్త యాప్..!

image

పత్తి కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించడానికి కేంద్రం కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. కనీస మద్దతు ధరకు పంటను విక్రయించేందుకు ‘కపాస్ కిసాన్’ యాప్‌ను తెచ్చింది. రైతులు యాప్‌లో OTPతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత స్లాట్ బుక్ ఆప్షన్ ఉంటుంది. దానిని ఎంచుకోవాలి. తర్వాత భూమి వివరాలు నమోదు చేసి స్లాట్ వివరాలు చెక్ చేసుకోవాలి. ఉమ్మడి ADBలో 5 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగవుతోంది.

News September 19, 2025

గుంటూరు రైల్వేస్టేషన్‌లో కొత్త సదుపాయం

image

రాబోయే పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రయాణికుల కోసం టిక్కెట్ కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. గుంటూరు స్టేషన్‌లో సిబ్బంది ధరించే జాకెట్ల వెనుక భాగాన క్యూఆర్ కోడ్ అమర్చారు. ప్రయాణికులు యూటీఎస్, రైల్ వన్ యాప్ ద్వారా ఆ కోడ్‌ను స్కాన్ చేసి కాగిత రహిత టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. ఇకపై 5KM లోపు ఇంటి నుంచే జనరల్, ప్లాట్‌ఫామ్, సీజన్ టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యం లభిస్తోంది.