News November 19, 2025

ములుగు: లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా?

image

ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు వహిస్తున్న బడే చొక్కారావు @ అలియాస్ దామోదర్ సురక్షితంగానే ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. 1997లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన.. హిడ్మా ఎన్కౌంటర్‌తో ఆయన పోలీసులకు లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా? అనేది చూడాలి.

Similar News

News April 14, 2026

అనకాపల్లి: రేపే ఇంటర్ ఫలితాలు.. 26,302 మంది నీరీక్షణ

image

ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 13,153 మంది, ద్వితీయ సంవత్సరంలో 13,149 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి ధైర్యం చెప్పాలని అధికారులు సూచిస్తున్నారు. ఫలితాలు అందరికంటే ముందుగా Way2News యాప్‌లో చూడవచ్చు.

News April 14, 2026

బెంగాల్‌ ప్రజలకు కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు

image

* జిల్లా ఆస్పత్రుల్లో ఫ్రీ డయాలసిస్, క్యాన్సర్ చికిత్స సహా ₹10లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్
* అబ్బాయిలకు గ్రాడ్యుయేషన్ వరకు, మహిళలకు పీజీ వరకు ఉచిత విద్య
* రైతులకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ సహా ఏటా ₹15వేలు
* ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, AI స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు
* మహిళలకు నెలకు ₹2వేలు. <<-se>>#Elections2026<<>>

News April 14, 2026

ఈ నెల 16న పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ

image

మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించే బిల్లుపై ఈ నెల 16న పార్లమెంటులో చర్చ జరగనుంది. ఈ బిల్లుపై చర్చ కోసం లోక్‌సభలో 18 గంటలు, రాజ్యసభలో 10 గంటల సమయం కేటాయించారు. దీనిపై ప్రధాని మోదీ ఉభయ సభల్లో ప్రసంగించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వనున్నారు. 16, 17న లోక్‌సభలో, 18న రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించనున్నారు.