News September 8, 2025
ములుగు: వాట్సాప్ చాట్ బాట్ ద్వారా విద్యుత్ ఫిర్యాదులు

విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం TGNPDCL ఆధ్వర్యంలో వాట్సాప్ చాట్ బాట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు డీఈ నాగేశ్వరరావు ఈరోజు తెలిపారు. వినియోగదారులు 7901628348 నంబర్‌కు హాయ్ పంపితే కంప్లైంట్ నమోదు, ట్రాక్, ఏజెంట్‌తో చాట్ వంటి సేవలు పొందవచ్చన్నారు. కంప్లైంట్‌కు ప్రత్యేక ID సృష్టించి SMS ద్వారా మెసేజ్ వస్తుందన్నారు. అదేవిధంగా 1912 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Similar News
News September 9, 2025
మత్తడివాగు ప్రాజెక్టు పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తాంసి మండలం మత్తడివాగు ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో(క్యాచ్మెంట్) వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు వరద గేట్లు నుంచి సోమవారం రాత్రి ఎప్పుడైనా నీళ్లను వదిలే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాథోడ్ విట్టల్ తెలిపారు. నదీ పరీవాహక (దిగువ) ప్రాంతంలోకి పశువులు గాని, గొర్రె కాపరులు, మత్సకారులు, రైతులు ఎవరూ వెళ్లవద్దని సూచించారు.
News September 9, 2025
డొనాల్డ్ ట్రంప్ మనవరాలిని చూశారా?

యూఎస్ ఓపెన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ సందడి చేసింది. ఈ ఈవెంట్‌కు ట్రంప్‌తో పాటు ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్, వారి కుమార్తె అరబెల్లా రోజ్ కుష్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియా కళ్లన్నీ 13 ఏళ్ల అరబెల్లానే ఫోకస్ చేయడంతో ఆమె హైలైట్ అయ్యారు. తన తాత ట్రంప్‌తో ముచ్చటిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
News September 9, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఎంపీలతో లోకేశ్ భేటీ

AP: ఉపరాష్ట్రపతి ఓటింగ్ ప్రక్రియపై మంత్రి నారా లోకేశ్ టీడీపీ ఎంపీలకు పలు సూచనలు చేశారు. రేపు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లారు. అక్కడ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. కాగా టీడీపీకి లోక్‌సభలో 16, రాజ్యసభలో ఇద్దరు ఎంపీల బలం ఉంది.