News September 20, 2025
ములుగు: విధి వింతాట.. సరిహద్దు నుంచి స్వగ్రామానికి..!

దేశ రక్షణ కోసం సరిహద్దులో పహారా కాస్తున్న ఓ జవాను పండుగకు సెలవులపై ఇంటికి సంతోషంగా వద్దామనుకున్నాడు. తీరా, విధి విషాదం నింపింది. మృతి చెందిన భార్యను కడసారి చూసుకునేందుకు వచ్చేలా చేసింది. ములుగు జిల్లా దేవగిరి పట్నంకు చెందిన ఐటీబీపీ హవల్దార్ శ్రీను భార్య ప్రీతి అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. దీంతో గ్రామానికి వచ్చిన శ్రీను ఆమెకు అంత్యక్రియలు జరిపించారు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది.
Similar News
News September 20, 2025
సైబర్ నేరాల బారిన పడకుండా చూడాలి: ఎస్పీ

ఇల్లందు డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ రోహిత్ రాజు సందర్శించారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు జరగకుండా ప్రతి ఏరియాలో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సైబర్ నేరాల బారిన ప్రజలు పడకుండా నిత్యం అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సీఐలు ఉన్నారు.
News September 20, 2025
కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాథన్యత ఇవ్వాలి: ఖమ్మం సీపీ

పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సీపీ సునీల్ దత్ ఆదేశించారు. శుక్రవారం ముదిగొండ, బోనకల్, చింతకాని పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శిక్షల శాతం మరింత పెంచేందుకు అత్యున్నత ప్రమాణాలతో కేసుల దర్యాప్తు చేపట్టాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
News September 20, 2025
ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు

AP: రాయలసీమలో ఇవాళ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. కర్నూలు, నంద్యాల, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు-భారీ వర్షాలు, శ్రీకాకుళం, VZM, అల్లూరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది. SEP 26న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది.