News April 8, 2025
ములుగు: ‘వేసవి క్రీడల శిక్షణకు దరఖాస్తు చేసుకోండి’

ములుగు జిల్లాలో మే 1 నుంచి నెల రోజుల పాటు నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలలో 14 ఏళ్ల బాల బాలికలకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు గాను అర్హులైన వ్యాయామ ఉపాధ్యాయులు, జాతీయ స్థాయి క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి తుల రవి తెలిపారు. శిక్షకులకు రూ.4 వేల గౌరవ వేతనం అందజేస్తామని, ఆసక్తి గల వారు ఈ నెల 15లోగా జిల్లా సంక్షేమ భవన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News April 8, 2025
మంచిర్యాల: గోదావరిలో దూకి వ్యక్తి సూసైడ్

గోదావరిలో దూకి వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగింది. మందమర్రికి చెందిన హషాం అహ్మద్(45) సోమవారం రాయపట్నం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. అహ్మద్ కొంతకాలం నుంచి ఫైనాన్స్ విషయంపై బాధపడుతున్నాడన్నారు. మృతుడి తండ్రి మహమ్మద్ అలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.
News April 8, 2025
పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్

TG: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇవాళ్టి నుంచి జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో తాము కాలేజీలు నడపలేకపోతున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందించింది. ఆస్తులు అమ్మి కాలేజీలు నడుపుతున్నామని, నాలుగేళ్లుగా బకాయిలు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
News April 8, 2025
నిజామాబాద్‌లో రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన డిచ్‌పల్లి స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాలు.. సోమవారం రాత్రి డిచ్పల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 30-35 ఏళ్లు ఉండొచ్చని అంచనా వేశారు. వివరాలు తెలిసిన వారు 8712658591 నంబరును సంప్రదించాలన్నారు.