News September 21, 2025
ములుగు: సంప్రదాయ దుస్తులు.. గౌరమ్మ పోలికలు!

ములుగు జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మను పేర్చిన ఆడబిడ్డలు బొడ్రాయి, ఆలయాల వద్ద ఆడిపాడుతున్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేస్తున్నారు. చిన్నారులను అందంగా అలంకరించిన తల్లిదండ్రులు ‘గౌరమ్మ పోలిక’ అంటూ సంబరపడుతున్నారు. బతుకమ్మ వేడుకల్లో తీరొక్క పూల బతుకమ్మలతో పాటు పట్టు చీరలు, ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Similar News
News September 22, 2025
నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం

సీనియర్ నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి గీతా రాధ(86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచినట్లు రాధిక తెలిపారు. చివరి చూపుల కోసం ఆమె భౌతికకాయాన్ని పోయెస్ గార్డెన్‌లో ఉంచారు. రేపు (సెప్టెంబర్ 22) చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశానవాటికలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
News September 22, 2025
నిర్మల్: రేపటి ప్రజావాణి రద్దు: జిల్లా కలెక్టర్

నిర్మల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపు (సెప్టెంబర్ 22, సోమవారం) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం, వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక ప్రజావాణిని తిరిగి నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అత్యవసర సమస్యలు ఉన్నవారు నేరుగా సంబంధిత శాఖాధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు.
News September 22, 2025
రేపు ‘దసరా బోనస్’ ప్రకటించనున్న సీఎం!

TG: సింగరేణి ఉద్యోగులకు CM రేవంత్ రేపు ‘దసరా బోనస్’ ప్రకటించనున్నట్లు సమాచారం. శాశ్వత ఉద్యోగులకు రూ. 1.90 లక్షలు, తాత్కాలిక ఉద్యోగులకు రూ. 5వేల వరకు బోనస్ లభించే అవకాశం ఉంది. అలాగే సింగరేణి ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏటా బొగ్గు అమ్మకాలు, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా వచ్చే లాభాల నుంచి ఉద్యోగులకు బోనస్ ఇస్తోంది.