News January 5, 2026
ములుగు: సన్న బియ్యంలో నూకలు.. ఎక్కడివి?

జిల్లా వ్యాప్తంగా చౌక ధరల( రేషన్ షాప్) దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో నూకలు రావడంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కిలో బియ్యంలో 100 గ్రాముల వరకు నూకలు వస్తున్నాయని సన్న బియ్యం లబ్ధిదారులు వాపోతున్నారు. రైతులు పండించిన ధాన్యంలో నూక శాతానికి తరుగు తీసి, ప్రభుత్వం పంపిణీ చేసే సన్న బియ్యంలో నూకలు ఎక్కడివని సన్న బియ్యం లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News January 8, 2026
చిన్నారుల దత్తత.. అసలు విషయం చెప్పిన శ్రీలీల

నటి శ్రీలీల 2022లో గురు, శోభిత అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. దీనికి గల కారణాలను ‘పరాశక్తి’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా వెల్లడించారు. చిన్న వయసులోనే పిల్లలను దత్తత తీసుకోవడానికి ప్రేరణ ఇచ్చింది ఒక దర్శకుడు అని తెలిపారు. “కన్నడలో ఓ సినిమా చేసేటప్పుడు ఆయన నన్ను అనాథాశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడి పిల్లలు నాకు బాగా దగ్గరయ్యారు. ఇద్దరని దత్తత తీసుకున్నాను” అని చెప్పారు.
News January 8, 2026
మార్కాపురం: వృద్ధులే లక్ష్యంగా డిజిటల్ అరెస్ట్ స్కాం: ఎస్పీ

వృద్ధులే లక్ష్యంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. సీబీఐ, ఈడీ కోర్టు అధికారులమని చెప్పి మీ పిల్లలపై కేసు ఉంది.. ఇప్పుడే అరెస్టు చేస్తామని భయపెట్టి డబ్బులు దోచుకోవడమే డిజిటల్ అరెస్ట్ అన్నారు. అపరిచిత వీడియో కాల్ ఎత్తవద్దని, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దన్నారు. సైబర్ క్రైమ్ బాధితులైతే 1930కి కాల్ చేయండాని సూచించారు.
News January 8, 2026
నగరంలో ఆహార కల్తీని ఉపేక్షించేది లేదు: సజ్జనార్

నగరంలో ఆహార కల్తీని ఉపేక్షించేది లేదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఆహార కల్తీని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. సీపీ మాట్లాడుతూ.. వ్యాపారులనే కాకుండా, కల్తీకి మూలమైన తయారీ కేంద్రాలపై దాడులు చేస్తామని, ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ పాసీజర్‌ను రూపొందించి అమలు చేస్తామన్నారు.


