News September 14, 2025

ములుగు సమగ్ర స్వరూపంపై పుస్తకం రూపకల్పన

image

తెలంగాణా సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా సమగ్ర స్వరూపం అనే పుస్తకాన్ని వెలువరిస్తుందని నిర్వాహకులు తెలిపారు. జిల్లా చరిత్ర, నైసర్గిక స్వరూపం, నీటిపారుదల, వ్యవసాయం, పర్యాటక, విద్యా, రాజకీయ, ఆధ్యాత్మిక, సామాజిక, కళా రంగాలు, ఇతర అంశాలపై రచయితల నుంచి వ్యాసాలు ఆహ్వానిస్తున్నామని, అమ్మిన శ్రీనివాసరాజు 7729883223, కె. వెంకటరమణ 9849905900లకు వాట్సాప్ ద్వారా పంపాలని కోరారు.

Similar News

News September 14, 2025

వనపర్తి: బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గిరిధర్ హెచ్చరించారు. ప్రేమ పేరుతో 18 ఏళ్ల లోపు బాలికలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. బాలల సంరక్షణ కోసం 24 గంటల హెల్ప్‌లైన్ నెంబర్ ‘1098’ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. బాల్య వివాహాలు లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు.

News September 14, 2025

తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్ సోనారిక

image

టాలీవుడ్ హీరోయిన్ సోనారిక శుభవార్త చెప్పారు. తాను తల్లిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు SMలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా సోనారిక తెలుగులో జాదుగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లో నటించారు. 2022లో తన ప్రియుడు, వ్యాపారవేత్త వికాస్ పరశా‌ర్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వారు పెళ్లి చేసుకున్నారు.

News September 14, 2025

ములుగు: బుల్లెట్ బండిపై SP, మంత్రి సీతక్క..!

image

మంత్రిననే హోదాను పక్కనబెట్టి సాధారణ వ్యక్తిగా వ్యవహరించడం సీతక్క నైజం. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే ఆమె ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. ఆదివారం మేడారం జాతర పనుల పర్యవేక్షణకు వెళ్లిన మంత్రి ములుగు SP శబరీష్ బుల్లెట్ బైక్ నడుపుతుండగా వెనుక కూర్చొని జాతర జరిగే పరిసరాలను పరిశీలించారు. రోడ్లు, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ ఏర్పాట్లపై సమీక్షించారు. జాతర నిర్వహణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.