News March 13, 2025

ములుగు: స్కూల్ బస్సులు భద్రమేనా!

image

ములుగు జిల్లాలోని వివిధ ప్రైవేటు పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సుల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళనలు నెలకొంది. సరైన ఫిట్నెస్ లేని బస్సులు, అనుభవం లేని డ్రైవర్లులతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని గుబులు చెందుతున్నారు. మద్యం మత్తులో, మరమ్మతుకు వచ్చిన పాఠశాల బస్సులు నడిపి ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించకపోవడం గమనార్హం.

Similar News

News September 14, 2025

HYD: కొడుకును చంపి మూసీలో పడేశాడు

image

HYDలోని బండ్లగూడ PS పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన కొడుకు అనాస్(3)ని తండ్రి మహమ్మద్ అక్బర్ దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి మూసీలో పడేశాడు. బాలుడు కనిపించడం లేదని ఏంతెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానంతో విచారించగా.. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.

News September 14, 2025

విజయవాడ: చెత్త ట్రాక్టర్‌లో తాగునీరు పంపిణీ

image

విజయవాడలోని న్యూ రాజేశ్వరిపేట కాలనీలో తాగునీటి సరఫరాపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డయేరియా ప్రబలిన ఈ ప్రాంతంలో శనివారం ఉదయాన్నే తడి, పొడి చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్‌లలోనే మినరల్ వాటర్‌ను సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనివల్ల మరింతగా బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

News September 14, 2025

HYD: కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీ అరెస్ట్

image

ప్లాట్ల అమ్మకం ముసుగులో చీటింగ్ చేసి పరారీలో ఉన్న కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీని LBనగర్ SOT బృందం, LBనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ప్రదేశాల్లో ప్లాట్లను అమ్మే ముసుగులో భారీగా డబ్బు కాజేసి చాలా మందిని మోసం చేసిన ఆదిభట్లకు చెందిన శ్రీకాంత్(35)ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అతడిపై సరూర్‌నగర్, వనస్థలిపురం, మేడిపల్లిలో కేసులు ఉన్నాయని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.