News March 14, 2025
ములుగు: హోలీ పండుగ వేళ రంగుల చందమామ

హోలీ పండుగ వేళ శుక్రవారం సాయంత్రం చందమామ బంగారం వర్ణంతో దర్శనమిచ్చాడు. చందమామ చుట్టూ వలయం హోలీ రంగును పోలి ఉండడంతో ప్రజలు చందమామను ఆసక్తిగా తిలకించారు. హోలీ పండుగ వేళ ఆకాశంలో నెలకొన్న ఈ అద్భుత దృశ్యాన్ని ప్రకృతి ప్రేమికులు తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు.
Similar News
News February 26, 2026
రాష్ట్రానికి రూ.2,160 కోట్లు?

TG: PMAY-అర్బన్ స్కీమ్ కింద రాష్ట్రానికి 1.3 లక్షల యూనిట్లు మంజూరవడంతో ₹1,695 కోట్లు అందనున్నాయి. అలాగే PMAY-గ్రామీణ్ పథకం కింద 3 లక్షల యూనిట్లు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మార్చి రెండో వారంలో ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఇది అమల్లోకి వస్తే మరో ₹2,160 కోట్లు అందనున్నాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి బూస్ట్ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
News February 26, 2026
జగిత్యాల: ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఐదు నెలల ఉచిత శిక్షణకు సంబంధించిన ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలైనట్లు డైరెక్టర్ జి.నరేశ్ తెలిపారు. అభ్యర్థులు https://tsstudycircle.co.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. మార్చి 1న ఉదయం 10 నుంచి 1 గంటల వరకు రామకృష్ణ డిగ్రీ & పీజీ కాలేజీలో పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. హాల్ టికెట్, ఆధార్ కార్డు ఉంటేనే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామన్నారు.
News February 26, 2026
మారిన మనుషులు.. స్నేహితులే వద్దంట!

బంధాలే కాదు స్నేహాలూ తగ్గిపోయాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. బిజీ లైఫ్‌స్టైల్, స్మార్ట్‌ఫోన్ అడిక్షన్‌తో ఫ్రెండ్‌షిప్ ఆన్‌లైన్‌కే పరిమితమైంది. 1960ల్లో ఒక్కొక్కరికీ వంద మంది స్నేహితులుంటే 1990 సమయంలో ఐదుగురికి, ప్రస్తుతం ఒక్కరికి పడిపోయింది. దేశంలో 15% మందికి అసలు ఫ్రెండ్సే లేరు. దీనిని ‘ఫ్రెండ్‌షిప్ రిసెషన్’ అంటారు. ఇది ఒంటరితనానికి దారితీసి డిప్రెషన్‌లోకి నెట్టేస్తుంది. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా?


