News February 11, 2025

ములుగు: 10 పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి : కలెక్టర్

image

రానున్న పదవ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఎంఈవోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎంఈవోలు, హెచ్ఎంలు కృషి చేయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిని ప్రోత్సహించాలన్నారు. తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి, ఇంటి వద్ద చదివేలా కృషి చేయాలన్నారు.

Similar News

News September 16, 2025

నెల్లూరు నగరపాలక సంస్థలో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు

image

నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఇన్‌ఛార్జ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ శివకుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కమిషనర్ నందన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని కనకమహాల్ సెంటర్లో మూడంతస్తుల భారీ భవంతి నిర్మిస్తున్నారు. దానికి ఎలాంటి అనుమతులు లేవు. వ్యవహారాన్ని మేయర్ స్రవంతి ఇటీవల బయటపెట్టడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది.

News September 16, 2025

16 వేల మంది విదేశీయులపై చర్యలకు కేంద్రం సిద్ధం

image

డ్రగ్ ట్రాఫికింగ్ కేసుల్లో పట్టుబడిన 16 వేల మంది విదేశీయులపై చర్యలకు కేంద్రం సిద్ధమైంది. వారిని స్వదేశాలకు పంపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) సమర్పించిన నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే రాష్ట్రాల వారీగా డ్రగ్ ట్రాఫికర్స్ జాబితా సిద్ధం చేసి కేంద్ర హోం శాఖకు పంపినట్లు వెల్లడించాయి.

News September 16, 2025

జేపీ నడ్డాకు మోరి జీడిపప్పు దండతో సత్కారం

image

విశాఖపట్నంలో సోమవారం జరిగిన సారథ్యం సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన జీడిపప్పుతో తయారు చేసిన దండతో సత్కరించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, ఇతర రాష్ట్ర నేతలు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమను సత్కరించిన అంబేడ్కర్ కోనసీమ నేతలను జేపీ నడ్డా అభినందించారు.