News December 17, 2025

ములుగు: 11 గంటల వరకు 60.64% పోలింగ్ నమోదు

image

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదవుతోంది. ఉదయం 11 గంటల వరకు 60.64% ఓట్లు పోలయ్యాయి. కన్నాయిగూడెం మండలంలో 64.91%, వెంకటాపురం మండలంలో 60.10%, వాజేడు మండలంలో 59.35% పోలింగ్ నమోదయింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. కలెక్టర్, ఎన్నికల అబ్జర్వర్ పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News December 23, 2025

పెరటి కోళ్ల పెంపకం.. స్వర్ణధార కోళ్ల ప్రత్యేకత ఇదే

image

స్వర్ణధార కోళ్లు కూడా పెరటి కోళ్ల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి అధిక శరీర బరువును కలిగి ఉంటాయి. ఏడాదికి 190 వరకు గుడ్లను పెడతాయి. గుడ్లు, మాంసం ఉత్పత్తి కోసం ఎక్కవ మంది పెరటి కోళ్ల పెంపకానికి స్వర్ణధార కోళ్లను ఎంపిక చేసుకుంటారు. ఇవి 22 నుంచి 23 వారాల్లో సుమారు 3 నుంచి 4 కిలోల బరువు పెరుగుతాయి. వీటి గుడ్డు బరువు 50-60 గ్రాములుంటుంది. స్వర్ణధార కోళ్లకు గుడ్లు పొదిగే సామర్థ్యం 80-85%గా ఉంటుంది.

News December 23, 2025

‘ఉపాధి’ స్థానంలో కొత్త చట్టం.. 26న గ్రామ సభలు

image

AP: ఉపాధి హామీ చట్టం(MGNREGA) స్థానంలో కేంద్రం కొత్తగా <<18633224>>VB-G RAM G<<>> చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న అన్ని పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కొత్త చట్టం గురించి రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి అధికారులకు కేంద్ర అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు. ఏడాదికి 125 పనిదినాలున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

News December 23, 2025

ఎద్దు మోసినంత, గోనె పట్టినంత

image

పూర్వకాలంలో ధాన్యాన్ని లేదా వస్తువులను కొలవడానికి పెద్ద గోనె సంచులను ఉపయోగించేవారు. ఒక ఎద్దు ఎంత బరువును మోయగలదో, ఒక పెద్ద గోనె సంచిలో ఎంత పరిమాణం పడుతుందో అంత ఎక్కువగా (అంటే చాలా సమృద్ధిగా) ఒకరి దగ్గర ధనం కానీ, వస్తువులు కానీ ఉన్నాయని చెప్పడానికి ఈ సామెతను వాడతారు. ముఖ్యంగా అపారమైన ఐశ్వర్యాన్ని లేదా విపరీతమైన లాభాన్ని సూచించడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.