News March 1, 2025

ములుగు: 25 ఏళ్ల తర్వాత తెరుచుకున్న రోడ్డు!

image

ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ముందు నుంచి 25 ఏళ్ల తర్వాత రోడ్డు మార్గానికి మోక్షం కలిగింది. 2001లో నక్సల్స్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఐదుగురిని హతమార్చారు. అప్పుడు ప్రధాన రోడ్డు పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఉండటంతో మందుపాతర్లను ట్రాక్టర్లలో అమర్చి పేల్చివేశారు. అప్పటి ఎస్సై, ప్రస్తుత ఏసీపీ కిరణ్ కుమార్ ఎదురుదాడి చేసి విరోచితంగా పోరాడారు. కాగా, ప్రస్తుతం ఆ రోడ్డు మార్గం ప్రారంభం కానుంది.

Similar News

News October 31, 2025

కాసిపేట: అన్ని సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్

image

కాసిపేట మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం సందర్శించారు. ల్యాబ్, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించి విద్యా బోధన చేయాలన్నారు.

News October 31, 2025

అమలాపురం: నవంబర్ 4న జాబ్ మేళా

image

నిరుద్యోగ యువత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాల ద్వారా ఐటీ రంగంలో రాణించాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు. వికాస ద్వారా నిరుద్యోగులకు మంచి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. నవంబర్ 4వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో వికాస ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా జరుగుతుందని, ఐటీ రంగ యువత దీనిని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

News October 31, 2025

GWL: సమగ్రత కోసం పోరాడిన ఉక్కు మనిషి పటేల్: ఎస్పీ

image

దేశ సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ విశేష కృషి చేశాడని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలన అనంతరం స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న భారత భూభాగాన్ని ఏకం చేసి దేశ రక్షణ, సమగ్రత కోసం పాటుపడ్డాడన్నారు. తొలి హోం శాఖ మంత్రిగా పోలీస్ వ్యవస్థ ప్రక్షాళనకు కృషి చేశాడన్నారు.