News May 9, 2024
ములుగు: 3 రోజులు మద్యం షాపులు బంద్
ములుగు జిల్లా వ్యాప్తంగా ఈనెల 11 నుంచి 13 వరకు అన్ని మద్యం షాపులను మూసివేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మద్యం షాపులను మూసివేయనున్నట్లు తెలిపారు. జూన్ 4న తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా మద్యం దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు.
Similar News
News January 19, 2025
ముగిసిన మావోయిస్టు దామోదర్ ప్రస్థానం!
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్@ <<15194613>>చొక్కారావు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రస్థానం ముగిసిందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాల్వపల్లికి చెందిన దామోదర్ గోవిందరావుపేట కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో మావోయిస్టు భావాజాలానికి ఆకర్షితుడై అడవిబాట పట్టాడు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
News January 19, 2025
UPDATE: ఆరెపల్లి వద్ద యాక్సిడెంట్.. ఇద్దరు మృతి
WGL ములుగు రోడ్డు సమీపంలోని ఆరెపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం <<15190249>>ఓ మహిళ మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. కాగా ఇదే ప్రమాదంలో గాయపడిన మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కరీమాబాద్‌కు చెందిన కనకలక్ష్మి, సాంబలక్ష్మి చీపురు కట్టల వ్యాపారం చేసేవారు. పస్రా నుంచి చీపురు కట్టలు కొనుగోలు చేసి ఆటోలో వస్తుండగా RTC అద్దె బస్సు ఢీకొని మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 19, 2025
స్మార్ట్ సిటీ పనులు గడువు లోగా పూర్తి చేయండి: కమిషనర్
గ్రేటర్ వరంగల్ పరిధిలో స్మార్ట్ సిటీ పథకం కింద కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ ఎండీ, GWMC కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖడే అధికారులను ఆదేశించారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజినీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో స్మార్ట్ సిటీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.