News March 1, 2026
ములుగు: CG మావోయిస్టుల డంప్ స్వాధీనం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో పోలీసులకు భారీ విజయంలభించింది. నక్సలైట్లు రెండు వేర్వేరు ప్రదేశాల్లో దాచిన డంప్‌లపై శనివారం దాడులు నిర్వహించి రూ.46,31,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండో డంప్‌లో భారీ ఆయుధాలు, కార్ట్రిడ్జ్‌లు, ఎలక్ట్రానిక్ సామగ్రి పట్టుబడ్డాయి. ఇప్పటివరకు భద్రతా దళాలు మొత్తం రూ.1.08 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News March 1, 2026
SPMVV: దరఖాస్తులకు గడువు పొడిగింపు

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో శ్రీపద్మావతి మహిళా విశ్వ విద్యాలయం నిర్వహిస్తున్న ఏపీ లా సెట్, ఏపీ పీజీ లాసెట్‌కు దరఖాస్తులు చేసుకునే తేదీనీ మార్చ్ 20వ తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్ సీతాకుమారి తెలిపారు. అలాగే అపరాధ రుసుముతో ఏప్రిల్ 6 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, పరీక్ష మే నెల 4 వ తేదీన జరుగుతుందని అన్నారు. మరిన్ని వివరాలకోసం https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
News March 1, 2026
కృష్ణా: డిగ్రీ పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో జనవరి 2026లో నిర్వహించిన డిగ్రీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 12లోపు ఒక్కో పేపరుకు రూ.800 ఫీజు ఆన్‌లైన్‌లో http://www.onlinesbi.com/ వెబ్‌సైట్‌లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం సూచించింది.
News March 1, 2026
KNR: ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

HYD బోయినపల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 2026-27 విద్యా సంవత్సరానికి 5 తరగతిలో ప్రవేశాలకు గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి దివాకర్ రావు తెలిపారు. దీంతో పాటు పలు తరగతులలో ఖాళీగా ఉన్న 21 సీట్లను సైతం భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 12 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.


