News January 28, 2025
ములుగు: ‘MLA సీతక్క’ స్టిక్కర్‌తో పేరుతో వాహనం కలకలం

ములుగు ఎమ్మెల్యే, సీతక్క పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని ఓ వాహనం జిల్లాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు రవి ములుగు ఎస్ఐ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. అయితే అదే వాహనంలో బీజేపీ కండువా సైతం ఉండటంతో ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఎక్కడైనా వాహనం కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని రవి కోరారు.
Similar News
News November 9, 2025
కేటీఆర్ ప్రచారం శ్రీలీల ఐటమ్ సాంగ్‌ను గుర్తు తెస్తోంది: రేవంత్

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చెరిపేస్తే చెరిగిపోయేది కాదని CM రేవంత్ అన్నారు. కానీ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి సినిమా మధ్యలో ఐటమ్ సాంగ్స్ వస్తుంటాయి. వాటిని కేటీఆర్ ఆదర్శంగా తీసుకొని మాపై విమర్శలు చేస్తున్నారు. ఆయన తీరు చూస్తుంటే పుష్ప సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ గుర్తొస్తోంది’ అని సెటైర్ వేశారు.
News November 9, 2025
కమనీయం.. భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి మూలమూర్తులకు అర్చకులు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మండపంలో విశ్వక్సేన పూజ, పుణ్యవాచనం జరిపారు. అనంతరం నిత్య కళ్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆదివారం కావడంతో భక్తులు స్వామివారిని పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు.
News November 9, 2025
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ల అరెస్టు

ఇద్దరు భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు విదేశాల్లో అరెస్టయ్యారు. భాను రాణా(లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్)ను అమెరికాలో, వెంకటేశ్ గార్గ్(నందు గ్యాంగ్)ను జార్జియాలో అదుపులోకి తీసుకున్నారు. సెక్యూరిటీ ఏజెన్సీలు, హరియాణా పోలీస్ శాఖ కలిసి వారిని పట్టుకున్నాయి. భాను, వెంకటేశ్‌ను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరిపై హరియాణా, పంజాబ్, ఢిల్లీలో పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులున్నాయి.


