News December 14, 2025

ములుగు: PHASE-2లో పెరిగిన పోలింగ్ శాతం

image

జిల్లాలో మొదటి విడత పోలింగ్ జరిగిన 3 మండలాలతో పోల్చితే రెండవ విడత పోలింగ్ జరిగిన 3 మండలాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. మొదటి విడత మండలాలైన గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో 73.57% పోలింగ్ నమోదు కాగా, రెండో విడత మండలాలైనా వెంకటాపూర్, ములుగు, మల్లంపల్లి మండలాల్లో 81.53% పోలింగ్ నమోదయింది. పెరిగిన పోలింగ్ శాతం అధికార పార్టీ మద్దతు దారులకు అనుకూలమని విశ్లేషకులు అభిప్రాయం.

Similar News

News January 2, 2026

ఈ ఏడాదిలోగా సర్వే పూర్తి: బాపట్ల JC

image

రీసర్వే పూర్తైన భూములకు జనవరి 9 వరకు 11 మండలాల్లోని 29 గ్రామాల్లో పాసు పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు శుక్రవారం బాపట్ల JC భావన విశిష్ట తెలిపారు. జిల్లాలో 31,760 పట్టాలు పంపిణీ చేయాల్సి ఉండగా, తొలిరోజు 3 రెవెన్యూ డివిజన్లలో 4,075 పట్టాలు అందజేశామన్నారు. తొలి 2 విడతల్లో 89 గ్రామాలలో సర్వే జరుగుతుందన్నారు. మే నెలలో ప్రారంభమయ్యే 5 విడతతో సహా, 6 విడతల్లో ప్రణాళికాబద్ధంగా రీసర్వే పూర్తి చేస్తామన్నారు.

News January 2, 2026

అంతా సిద్ధంగా ఉండాలి: నల్గొండ ఇన్‌ఛార్జ్ అదనపు కలెక్టర్

image

పురపాలక ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని, స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లతో రానున్న మున్సిపల్ ఎన్నికలపై సంసిద్ధత సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికలకు ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.

News January 2, 2026

నెల్లూరు: చిన్నారి డెడ్ బాడీ కలకలం

image

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక జగనన్న కాలనీలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిన్నారి మృతదేహం చూసిన కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.