News September 10, 2025
ములుగు TASK రీజినల్ సెంటర్‌లో ఉచిత శిక్షణ

ములుగు టాస్క్ రీజినల్ సెంటర్‌లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా కేంద్ర మేనేజర్ మురళి కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణలో జావా, పైథాన్, వెబ్ డెవలప్మెంట్, డేటాబేస్ (SQL), C, C++, HTML, CSS, JavaScript, Bootstrap వంటి కంప్యూటర్ కోర్సులు ఉంటాయన్నారు. విద్యార్థులు సెప్టెంబర్ 15, 16, 17 తేదీల్లో ములుగు TASK రీజినల్ సెంటర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
Similar News
News April 5, 2026
ఉప్పల్‌లో SRHకు అదిరిపోయే రికార్డులు!

IPL: హోంగ్రౌండ్ ఉప్పల్‌లో SRH తన పర్ఫార్మెన్స్‌తో అభిమానులను ఊర్రూతలూగిస్తూనే ఉంటుంది. 2013 నుంచి ఈ గ్రౌండులో ఆ జట్టు 63 మ్యాచులు ఆడగా 38 విజయాలను సొంతం చేసుకుంది. విన్నింగ్ పర్సెంటేజ్ 61కి పైనే ఉంది. మరోవైపు లీగ్‌లో ఇప్పటి వరకు నమోదైన రెండో అత్యధిక స్కోర్(286) గత సీజన్లో RRపై చేసింది. 2025లోనే పంజాబ్ జట్టుపై 247 పరుగులనూ ఛేదించింది. ఇక ఉప్పల్‌లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే 57% గెలవడం గమనార్హం.
News April 5, 2026
నరసన్నపేట: కల్తీ ఆహారంపై కనికరమేల..?

నరసన్నపేటలో నాణ్యతలేని ఆహార విక్రయాలు భారీగా సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మిల్క్ షేక్, హోటల్స్, స్వీట్ స్టాల్స్, రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ అమ్మకాలలో నాణ్యతా ప్రమాణాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల సింగపురంలో జరిగిన కల్తీ బాదంపాలు ఘటన అందరికీ తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
News April 5, 2026
NLG: సెల్‌ఫోన్ పక్కనపెట్టి.. లైబ్రరీకి వెళ్దాం!

స్మార్ట్‌ఫోన్ల వ్యసనంతో పిల్లల్లో పుస్తక పఠనం తగ్గి ఆలోచనా శక్తి దెబ్బతింటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవి సెలవులు, ఒంటిపూట బడుల నేపథ్యంలో పిల్లల సమయం వృథా కాకుండా వారిని గ్రంథాలయాలకు పంపాలని సూచిస్తున్నారు. ఉమ్మడి నల్గొండలోని 3 జిల్లా, 64 శాఖా గ్రంథాలయాల్లో ఏకంగా 1,07,951 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలు ఈ విజ్ఞాన భాండాగారాలను సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.


