News April 10, 2025
ములుగు: UPDATE.. మద్యానికి డబ్బు ఇవ్వలేదని హత్య

ములుగు జిల్లా వాజేడు మండలంలో <<16046948>>దారుణ హత్య జరిగిన విషయం<<>> తెలిసిందే. సీఐ కుమార్ తెలిపిన వివరాలు.. టేకులగూడెంకు చెందిన బుల్లబ్బాయి మద్యానికి డబ్బు ఇవ్వాలని తన అన్న విజయబాబును అడిగాడు. తన వద్ద లేవని చెప్పడంతో కోపంతో పదునైన ఆయుధంతో ముఖంపై దాడి చేసి హత మార్చాడు. విజయబాబు చిన్న తమ్ముడు రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
Similar News
News December 16, 2025
ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి హుండీ ఆదాయం రూ.1,17 కోట్లు

కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీని ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాస రెడ్డి అధ్వరంలో ఈరోజు లెక్కించారు. 70 రోజుల హుండీ ఆదాయం రూ.1,17,44,339 వచ్చిందని అధికారులు తెలిపారు. యూఎస్ఏ డాలర్లు 24, కెనడా డాలర్స్ 10, శ్రీలంక రూపి 100, 23 గ్రాముల బంగారు, 723 గ్రాముల వెండి వచ్చింది. హుండీ లెక్కింపు పర్యవేక్షణాధికారిగా నరసింహరాజు పాల్గొన్నారు.
News December 16, 2025
ADB: ఇప్పటికి రూ.20 లక్షల విలువైన మద్యం స్వాధీనం: ఎస్పీ

ఎన్నికల నియమావళి ప్రారంభమైనప్పటి నుంచి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు రూ.20 లక్షల విలువైన 2,554 లీటర్ల మద్యం, 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇప్పటి వరకు 70 కేసుల్లో 200 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నగదు, బహుమతులకు ప్రలోభపడకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
News December 16, 2025
అమలాపురం: 21న పల్స్ పోలియో

ఈ నెల 21వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ దినోత్సవంగా ప్రకటించిందని జిల్లా వైద్య శాఖ అధికారి దుర్గారావు దొర తెలిపారు. ఆ రోజున ప్రతి ఒక్కరూ ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అమలాపురంలో మంగళవారం ఆయన కోరారు. పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని దుర్గారావు దొర విజ్ఞప్తి చేశారు.


