News October 29, 2025
ముల్లోకాల్లో ఉన్న పుణ్య తీర్థాలు కలుస్తాయి

కార్తీక మాసంలోని పర్వదినాల్లో ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు కపిలతీర్థం పుష్కరిణికి చేరుతాయని ప్రతీతి. కార్తీక పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి, ద్వాదశి, సోమవారం, శనివారాల్లో మధ్యాహ్న సమయంలో వివిధ పుణ్యతీర్థాలు కలుస్తాయని అర్చకులు తెలిపారు. ఈ సమయంలో స్నానాలు చేయడం వల్ల సమస్త పాపవిముక్తి జరుగుతుందని భక్తుల విశ్వాసం.
Similar News
News October 29, 2025
భారీ వర్షంతో తొలి టీ20 రద్దు

ఆస్ట్రేలియా-భారత్ మధ్య కాన్‌బెర్రాలో జరిగే తొలి టీ20 రద్దయింది. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా దూకుడుగా ఆడింది. 9.4 ఓవర్లలో 97/1 రన్స్ చేసింది. అభిషేక్ 19 రన్స్ చేసి ఔటవ్వగా.. గిల్ 37*, సూర్య 39* దూకుడుగా ఆడారు.
News October 29, 2025
అర్ష్‌దీప్ బదులు హర్షిత్.. నెటిజన్ల ఆగ్రహం

ఆస్ట్రేలియాతో తొలి టీ20లో అర్ష్‌దీప్ సింగ్ బదులు హర్షిత్ రాణాను ప్లేయింగ్-11లోకి తీసుకోవడంపై నెటిజన్లు టీమ్ మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ను ఎందుకు పక్కనబెట్టారని ప్రశ్నిస్తున్నారు. హర్షిత్‌కు గంభీర్ సపోర్ట్ ఎక్కువగా ఉందని, బీసీసీఐలో రాజకీయాలు ఎక్కువ అయ్యాయని ఫైర్ అవుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News October 29, 2025
వికారాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- స్పీకర్

తుఫాను ప్రభావంతో వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, రైతులు పొలాల వద్దకు వెళ్లరాదని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


