News August 29, 2025
ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపాలి: కలెక్టర్

ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా వివిధ పార్టీల నాయకులను కోరారు. శుక్రవారం జనగామ కలెక్టరేట్లో ఓటర్ల జాబితా అభ్యంతరాలపై వివిధ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం చేసినట్లు తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు.
Similar News
News August 30, 2025
నాకు కులం, మతంతో పని లేదు: పవన్

AP: కులం, మత, ప్రాంతాలకు జనసేన అతీతం అని పవన్ అన్నారు. ‘నేను ఇస్లాం, క్రిస్టియన్ ఇతర మతాలను ఎంతో గౌరవిస్తాను. నాకు కులం, మతంతో పనిలేదు. సెక్యులర్ ముసుగులో హిందువులను, వారి సంప్రదాయాలను, మనోభావాలను కించపరిచే వారి విషయంలో సూటిగా మాట్లాడతాను. నిర్భయంగా, నిజాయితీగా మాట్లాడగలిగే ధైర్యం నాకు ఉంది. ఒక మాట మాట్లాడితే ఒక వర్గం ఓట్లు పోతాయనే భయం లేదు’ అని కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు.
News August 30, 2025
నారాయణపేట: జిల్లా సర్వే నివేదిక కమిటీ ఏర్పాటు

జిల్లా సర్వే నివేదిక కమిటీని ఏర్పాటు చేసేందుకు శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని నిర్ణీత గడువులోపు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. ఆ సమాచారాన్ని క్రోడీకరించి జిల్లా సర్వే నివేదికను రాష్ట్ర కాలుష్య మండలికి అందజేయాలని చెప్పారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
News August 30, 2025
దామరగిద్ద: దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తికి శిక్ష

నారాయణపేట బస్టాండ్‌లో దొంగతనాలు చేసిన దామరగిద్ద మండలం మద్దెలబీడు వాసి హనుమంతుకు JFCM జడ్జి సాయి మనోజ్ ఏడు నెలల 8 రోజుల శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారని సీఐ శివశంకర్ తెలిపారు. గత సంవత్సరం మార్చి, జూన్ నెలల్లో నారాయణపేట వాసి లక్ష్మి బస్ ఎక్కుతుండగా హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న 6 వేలు, 6 గ్రాముల బంగారం, మాగనూరు మండలం నేరడగం వాసి కవిత బ్యాగ్‌లో ఉన్న రూ.30 వేలు, తులం బంగారం చోరీ చేశాడన్నారు.