News April 12, 2024
ముసునూరు పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

రక్షణ కోసం ముసునూరు పోలీసులను గురువారం రాత్రి నూతన దంపతులు ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే ముసునూరు మండలం వేల్పుచర్ల గ్రామానికి చెందిన టి.రాధాకృష్ణ, పెదపాడు మండలం కేఆర్ పాలెం గ్రామానికి చెందిన ఎన్. నవ్య ఏలూరు పట్టణ కేంద్రంలో సోషల్ మ్యారేజ్ సంస్థ వారి ఆధ్వర్యంలో పెళ్లి చేసుకున్నారు. మేజర్లమైన తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలని పోలీసుల్ని ఆశ్రయించినట్లు వారు తెలిపారు.
Similar News
News December 15, 2025
BREAKING చల్లపల్లిలో కారు బీభత్సం.. వ్యక్తి మృతి

చల్లపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. స్థానికుల వివరాల మేరకు.. పోలీస్ స్టేషన్ బజార్లో కారు అదుపు తప్పి జనం మీదకి కారు దూసుకెళ్లింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా, వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News December 15, 2025
MTM: కొట్లాడుకున్నారు.. కలిసి విగ్రహాలు పెడుతున్నారు.!

మచిలీపట్నం నియోజకవర్గ కూటమిలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం తమ పార్టీ ముఖ్య నేతల విగ్రహాల ప్రతిష్ఠ విషయంలో రోడ్డెక్కి రచ్చ చేసిన TDP, BJP నేతలు నేడు ఒకటైపోయారు. హౌసింగ్ బోర్డ్ రింగ్‌లో వాజ్ పేయి విగ్రహం పెడతామని, కాదు NTR విగ్రహం పెడతామని ఆందోళనకు దిగిన ఇరు పార్టీల వాళ్లు పార్టీ పెద్దల ఆదేశాలతో అదే సెంటర్‌లో ఈ నెల 16న ఇద్దరి మహనీయుల విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు సిద్ధమయ్యారు.
News December 15, 2025
రేపు మచిలీపట్నంకు నారా లోకేశ్, పీవీఎన్ మాధవ్ రాక

మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ మంగళవారం మచిలీపట్నం రానున్నారు. స్థానిక న్యూ హౌసింగ్ బోర్డ్ రింగ్‌లో ఉమ్మడిగా ఏర్పాటు చేస్తున్న మాజీ ప్రధాని వాజ్ పేయి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాంస్య విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఇరువురు నేతలు పాల్గొననున్నట్లు ఆయా పార్టీ వర్గాలు తెలిపాయి. ఇరువురి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.


