News May 19, 2024

ముస్తాబవుతున్న నల్గొండ మెడికల్‌ కళాశాల

image

నల్గొండ మెడికల్‌ కళాశాల భవనాల సమూదాయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీలో 42 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న కళాశాల త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కళాశాల భవన సమదాయం నిర్మాణాలు 85 శాతం వరకు పూర్తి కావచ్చాయి. భవన సమూదాయాన్ని అక్టోబర్‌ చివరినాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ అధికారులు సెప్టెంబర్‌లోగా అన్ని పనులను పూర్తి చేసి అప్పగించాలన్న లక్ష్యంతో ఉన్నారు.

Similar News

News September 29, 2024

NLG: నల్గొండకు కావాలి హైడ్రా!

image

నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసినా అక్రమార్కుల్లో భయం కనిపించడం లేదు. నల్గొండ పట్టణంతో పాటు పరిసర మండలాల్లో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి ప్రభుత్వ స్థలాల్లో ఫ్లాట్లు ఏర్పాటుచేసి విక్రయించినట్లు తెలుస్తోంది. అధికారులు వీటిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

News September 29, 2024

యాదాద్రి శ్రీవారి విమాన గోపురానికి స్వర్ణతాపడం

image

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం పనులు దసరా పండుగ నాటి నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వర్ణ తాపడం పనులను స్మార్ట్ క్రియేషన్స్ వారికి అప్పగించారు. ఈ పనులను వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి చేయనున్నారు.

News September 29, 2024

పంచాయితీ ఓటర్లలో మహిళా ఓటర్లే అధికం

image

NLG:గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాను జిల్లా అధికారులు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 10,42,545 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళలు 5,25,780 మంది, పురుషులు 5,16,713 మంది,థర్డ్ జెండర్ 52 మంది ఉన్నారు. కాగా పురుషుల కంటే మహిళా ఓటర్లు 9,067 మంది అధికంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 868 గ్రామపంచాయతీలో 7,482 వార్డులు ఉన్నాయి. ప్రస్తుతం 856 పంచాయితీల్లో 7,393 వార్డుల ఓటర్ల జాబితాను ప్రకటించారు.