News February 10, 2025
ముస్తాబాద్: గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు

ముస్తాబాద్ మండలంలోని గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తన సిబ్బందితో కలిసి నామాపూర్, మొర్రపూర్, సేవాలాల్ గ్రామాలలో దాడులు నిర్వహించగా 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, ఐదు లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News July 4, 2025
ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వం మాదే: భట్టి

TG: రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ‘రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మార్చడానికి అది కేవలం ఒక పుస్తకం కాదు. రాజ్యాంగం లేకపోతే ఎవరికీ హక్కులు ఉండేవి కావు’ అని సామాజిక న్యాయ సమరభేరి సభలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఒక్క ఏడాదిలో ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు.
News July 4, 2025
ఎస్పీ గారు.. థ్యాంక్యూ: పవన్ కళ్యాణ్

తన పర్యటన సందర్భంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడంపై ఎస్పీ దామోదర్‌ను డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా అభినందించారు. మార్కాపురం పర్యటన అనంతరం హెలిప్యాడ్ వద్ద ఎస్పీని పవన్ ప్రత్యేకంగా షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. అలాగే జిల్లాలో శాంతి భద్రతల స్థితిగతులు సైతం మెరుగ్గా ఉన్నాయని పవన్ చెప్పడం విశేషం.
News July 4, 2025
కోనరావుపేట: ‘జీవితంలో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి’

జీవితంలో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో రూ. 5 కోట్ల 14 లక్షలతో చేపట్టిన అదనపు మౌలిక వసతుల నిర్మాణం పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన, భూమి పూజ చేశారు.