News April 27, 2024
ముస్తాబాద్: భార్య కాపురానికి రావడంలేదని భర్త సూసైడ్

భార్య కాపురానికి రావడంలేదని భర్త సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ముస్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని గూడురుకు చెందిన చెక్కపల్లి నర్సింహులు (45) తాగుడుకు బానిసయ్యాడు. దీంతో అతని భార్య పిల్లలతో ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో తీవ్రమనస్తాపం చెందిన నర్సింహులు ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 23, 2025
కరీంనగర్: ప్రాణదాతగా ‘108’ అంబులెన్స్ సేవలు

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ‘108’ అంబులెన్స్ సేవలు ప్రాణదాతగా నిలుస్తున్నాయి. ప్రమాదాలు, గర్భిణీలను ఆసుపత్రులకు చేర్చడం, తదితర సేవలలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. KNR జిల్లాలో ప్రస్తుతం 16 అంబులెన్సులు, 33మంది ఈఎంటీలు, 35 మంది పైలట్లు నిరంతరం అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్నారు. గత 20 నెలల కాలంలోనే జిల్లా వ్యాప్తంగా 56,171 మంది బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించి ప్రాణాలను కాపాడటం విశేషం.

KNR: షోకాజ్ నోటీసులపై అదనపు కలెక్టర్‌కు ‘టీటీయూ’ వినతి

పంచాయతీ ఎన్నికల విధులకు హాజరుకాని ఉపాధ్యాయులకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ తెలంగాణ టీచర్స్ యూనియన్ (TTU) నాయకులు సోమవారం అదనపు కలెక్టర్, డీఈవో డాక్టర్ అశ్వినీ తనజీ వాంక్డేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ.. అనారోగ్యం లేదా ఇతర సహేతుకమైన (జెన్యూన్) కారణాలతో విధులకు రాలేని వారికి తప్పనిసరిగా మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చారు.