News February 3, 2025

ముస్తాబాద్: వైన్స్ పర్మిట్‌ రూమ్‌లో వ్యక్తి హఠన్మారణం

image

ముస్తాబాద్‌లోని కొత్త బస్టాండ్ సమీపంలోని వైన్ షాపు పర్మిట్ రూమ్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి సోమవారం హఠాన్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నామాపూర్‌కు చెందిన తేపూరి నారాయణ(50) ఆదివారం రోజంతా పనిచేసి రాత్రి అక్కడే పర్మిట్ రూంలోనే పడుకున్నాడు. ఉదయం నిద్రలేచాక పర్మిట్ రూంలోనే హఠాత్తుగా కిందపడి చనిపోయాడు. మృతునికి అతిగా మద్యంతాగే అలవాటు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 16, 2025

కృష్ణా: DSC తుది జాబితాపై అభ్యంతరాల స్వీకరణ

image

మెగా డీఎస్సీ – 2025కు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1198 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి రామారావు సోమవారం తెలిపారు. ఈ జాబితాను https://apdscfss.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మంగళవారం 9441520389, 9247367099, 9490879139 నెంబర్లకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు.

News September 16, 2025

అలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం: DMHO

image

నంద్యాల: లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నంద్యాల DMHO డాక్టర్ వెంకటరమణ హెచ్చరించారు. తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమేనని చెప్పారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరిగితే తమకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

News September 16, 2025

కాకినాడ ఎస్పీ పీజీఆర్ఎస్‌కు 52 దరఖాస్తులు

image

కాకినాడలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో జరిగిన పీజీఆర్ఎస్‌కు 52 అర్జీలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు లిఖిత పూర్వకంగా ఎస్పీకి తమ సమస్యలను విన్నవించారు. వాటిపై స్పందించిన ఎస్పీ, సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, చట్ట పరిధిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.