News December 16, 2025
ముస్తాబాద్: 730 మందితో పటిష్ట బందోబస్తు: ఎస్పీ

మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు 730 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీస్ స్టేషన్లలో ఎన్నికల విధులపై పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆఖరి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
Similar News
News December 16, 2025
పోలీసులను బెదిరిస్తే ఊరుకోం: పవన్

AP: పోలీసు ఉన్నతాధికారులను మాజీ సీఎం బెదిరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పోలీసులను బెదిరిస్తే తమ ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. కానిస్టేబుల్ నోటిఫికేషన్‌పై కేసులు వేస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. మంగళగిరిలో కానిస్టేబుల్స్ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ మంత్రి నారా లోకేశ్ లేని లోటు కనిపిస్తోందని చెప్పారు.
News December 16, 2025
మూడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం!

జిల్లాలో మూడో విడతలో మొత్తం 68 గ్రామ పంచాయతీలకు గాను 67 జీపీల్లో పోలింగ్ జరగనుంది. ఒక జీపీ ఏకగ్రీవమైంది. అలాగే, 634 వార్డులకు గాను 71 వార్డులు ఏకగ్రీవం కాగా, 563 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. సర్పంచ్ స్థానానికి 230 మంది, వార్డు సభ్యుల స్థానానికి 1,424 మంది బరిలో ఉన్నారు. సజావుగా ఎన్నికల నిర్వహణకు 666 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
News December 16, 2025
ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి హుండీ ఆదాయం రూ.1,17 కోట్లు

కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీని ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాస రెడ్డి అధ్వరంలో ఈరోజు లెక్కించారు. 70 రోజుల హుండీ ఆదాయం రూ.1,17,44,339 వచ్చిందని అధికారులు తెలిపారు. యూఎస్ఏ డాలర్లు 24, కెనడా డాలర్స్ 10, శ్రీలంక రూపి 100, 23 గ్రాముల బంగారు, 723 గ్రాముల వెండి వచ్చింది. హుండీ లెక్కింపు పర్యవేక్షణాధికారిగా నరసింహరాజు పాల్గొన్నారు.


