News February 8, 2026
‘ముస్తాబు’తో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారాలి: పార్వతీపురం కలెక్టర్

పార్వతీపురం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు సమూల మార్పులతోనే ‘స్కూల్ ముస్తాబు’ కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ ప్రభాకర రెడ్డి అన్నారు. బెలగాంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత పట్ల బాధ్యత తీసుకోవాలని, గేటు నుంచి తరగతి గదుల వరకు మార్గాన్ని అందమైన పూలు, పచ్చని మొక్కలతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు.
Similar News
News February 21, 2026
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు: కామారెడ్డి SP

కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులను లక్ష్యంగా చేసుకుని కారుతో అతివేగంగా దూసుకెళ్లిన నిందితుడు గిరెడ్డి మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాత నేర చరిత్ర కలిగిన ఇతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, విద్వేషాలకు తావులేకుండా మత సామరస్యాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News February 21, 2026
శాంతియుతంగా పండుగలు జరుపుకుందాం: సీపీ

రాబోయే ఉగాది, హోలీ, రంజాన్ పండుగలను ప్రజలందరూ సోదరభావంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య పిలుపునిచ్చారు. శనివారం కమిషనరేట్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీక అని కొనియాడారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 21, 2026
బాన్సువాడ అల్లర్లు.. 12 మంది ARREST

బాన్సువాడలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రిలయన్స్ మార్ట్ వద్ద జరిగిన గొడవ, కానిస్టేబుల్‌పై దాడికి సంబంధించి ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం బృందాలు గాలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఎస్పీ హెచ్చరించారు.


