News April 9, 2025
ముస్లాపూర్‌లో వ్యక్తి మృతి.. పోలీసులకు ఫిర్యాదు

అల్లదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన నాయకిని సురేశ్ తన స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని కుంటలో ఎద్దులను కడగడానికి వెళ్లారు. ప్రమాదపుశాత్తు సురేష్ నీట మునిగినట్లు స్నేహితులు గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులు అతడిని బయటకి తీసి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కొడుకు మృతి పట్ల అనుమానం ఉందని తండ్రి నర్సింలు పోలీసులకు పిర్యాదు చేసారు. సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 17, 2025
మెదక్: ఈ నెల 20 నుంచి ఓపెన్ పరీక్షలు: డీఈఓ

ఈ నెల 20 నుంచి మే 26వ తేదీ వరకు జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. బుధవారం పరీక్షల కోసం సంబంధిత అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. పది పరీక్షలకు 459 మంది, ఇంటర్‌కు 876 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
News April 17, 2025
మెదక్ జిల్లాలో భూ భారతిపై అవగాహన సదస్సు

మెదక్ జిల్లాలో భూ భారతిపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. గురువారం మనోహారాబాద్, తుప్రాన్, 18న అల్లాదుర్గ్,రామాయంపేట, 19న శివంపేట,నర్సాపూర్, 20న కూల్చారాం, కౌడిపల్లి, 21న చిలిపిచేడ్, పాపన్నపేట,టేక్మాల్, 22న పెద్దశంకరంపేట్, రేగోడ్, 23న మసాయిపేట్, చేగుంట, చిన్నశంకరంపేట్, 24న ఎల్డుర్తి, నిజాంపేట్, 25న నార్సింగి, మెదక్, హవేళి ఘనపూర్ మండలాలున్నాయి.
News April 17, 2025
టేక్మాల్: బైక్ యాక్సిడెంట్.. ఒకరి మృతి

టేక్మాల్ మండలం లక్ష్మన్ తండాకు చెందిన పొమ్లా నాయక్ బైక్ ఢీకొని మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. టేక్మాల్‌కు చెందిన తలారి సతీశ్ తన బైక్‌తో ఎలకుర్తి గ్రామ శివారులో పొమ్లా నాయక్‌ను వెనకనుంచి బలంగా ఢీ కొట్టాడు. దీంతో పొమ్లా రోడ్డుపై పడి తీవ్ర గాయాలు కావడంతో మెదక్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ దయానంద్ తెలిపారు.