News March 30, 2025
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన BHPL కలెక్టర్

ముస్లిం ప్రజలకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆదివారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పవిత్రమైన నెలగా, త్యాగం, భక్తి, సహనం, మానవతా విలువల ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఉపవాస దీక్ష, ప్రార్థనలు, దానం వంటి ఆచారాలు సామాజిక సమగ్రతను పెంపొందిస్తాయని, అందరూ కలిసికట్టుగా సమాజంలో శాంతి, ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
Similar News
News April 1, 2025
భూకంపం.. మయన్మార్‌లో 2,719 మంది మృతి

భూకంప విలయానికి మయన్మార్‌లో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 2,719 మంది బాడీలు దొరికినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వారిలో ఐదేళ్లలోపు చిన్నారులు 50 మంది దాకా ఉన్నారని తెలిపాయి. 4,521 మంది గాయపడగా, ఇంకా 441 మంది ఆచూకీ దొరకాల్సి ఉందని పేర్కొన్నాయి. కాగా శిథిలాల కింద మృతదేహాలు వెలికితీయడం ఆలస్యం కావడంతో పలు చోట్ల దుర్వాసన వెలువడుతోంది.
News April 1, 2025
రేపు వైసీపీ నేతలతో జగన్ భేటీ

AP: ఇటీవల రాష్ట్రంలో జరిగిన MPP, జడ్పీ ఉపఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలతో YCP అధినేత జగన్ భేటీ కానున్నారు. పార్టీ విజయం కోసం సహకరించిన వారిని స్వయంగా అభినందించనున్నారు. కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కేసులతో కూటమి ఇబ్బంది పెట్టినా పార్టీ కోసం వీరంతా అంకితభావంతో పనిచేశారని YCP నేతలు చెబుతున్నారు. పలు జిల్లాల MPTC, ZPTCలు, పార్టీ మండల అధ్యక్షులు, కో-ఆప్షన్ సభ్యులు ఈ భేటీలో పాల్గొంటారు.
News April 1, 2025
మార్చిలో GST వసూళ్లు ₹1.96L Cr

జీఎస్టీ వసూళ్లలో మరోసారి వృద్ధి నమోదైంది. గతేడాది మార్చితో పోలిస్తే ఈ సారి 9.9% పెరిగి ₹1.96L Cr వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో CGST ₹38,100Cr, SGST ₹49,900Cr, IGST ₹95,900Cr, సెస్సులు ₹12,300Cr వసూలైనట్లు పేర్కొంది. రిఫండ్స్ రూపంలో ₹19,615Cr చెల్లించగా, నికరంగా ₹1.76L Cr వచ్చినట్లు తెలిపింది. FY2025లో మొత్తంగా ₹19.56L Cr వసూలైనట్లు(8.6% వృద్ధి) వివరించింది.