News February 21, 2025
మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది: కిషన్ రెడ్డి

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరిలో గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జారుతున్నాయని, ఆ స్థానాల్లో బీజీపీ పోటీ చేస్తుందని, ఈ మూడు స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News March 3, 2026
కామారెడ్డి: ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో ఉద్యోగ అవకాశాలు

కామారెడ్డిలోని ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నియమకాలు చేపట్టనున్నట్లు జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారులు తెలిపారు. సెంటర్‌లో పని చేయడానికి సూపరింటెండెంట్, పార్ట్ టైం ఆరోగ్య సిబ్బంది ఇతర ఉద్యోగాలకు, పదో తరగతి చదివి ఆసక్తి కలిగిన వారు ఈ నెల 13వ తేదీ లోపు జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 3, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 3)

1839: టాటా గ్రూప్ వ్యవస్థాపకులు జంషేడ్జీ టాటా జననం
1937: రచయిత సత్యం శంకరమంచి జననం
1967: సింగర్ శంకర్ మహదేవన్ జననం
1969: సినీ నటి మధుబాలా జననం
2002: పార్లమెంటు తొలి దళిత స్పీకర్ బాలయోగి మరణం
2003: MRF వ్యవస్థాపకుడు కేఎం మామ్మెన్ మాపిళ్లై మరణం
2008: తెలుగు సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన తొలి నటి నగరాజకుమారి మరణం.
News March 3, 2026
గల్ఫ్ నుంచి తిరిగొస్తున్న భారతీయులు

ఇరాన్ దాడులతో నిలిచిన పోయిన విమాన సేవలను గల్ఫ్ దేశాలు క్రమంగా పునరుద్ధరిస్తున్నాయి. దీంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు తిరిగొస్తున్నారు. ఇప్పటికే అబుదాబి నుంచి ఢిల్లీ, బెంగళూరుకు విమానాలు చేరుకున్నాయి. దుబాయ్ నుంచి కూడా విమానం బయలుదేరింది. కాగా అక్కడి గగనతల స్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ఈరోజు సౌదీలోని భారతీయుల కోసం ఇండిగో పది రిలీఫ్ ఫ్లైట్లు నడపనున్నట్లు తెలుస్తోంది.


