News December 23, 2025
మూడు కార్పొరేషన్లుగా మహానగరం..!

GHMCలో మున్సిపాలిటీల విలీనం అనంతరం మహానగరం 300 డివిజన్లకు పెరిగింది. అయితే ఇంత పెద్ద నగరానికి ఒకే కార్పొరేషన్ ఉండాలా లేక విభజించాలా అనే విషయాన్ని సర్కారు ఆలోచిస్తోంది. మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. గ్రేటర్‌ను 3 కార్పొరేషన్లుగా విభజించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
Similar News
News December 30, 2025
కొత్తగా నాటిన అరటి తోటల్లో కలుపు నివారణ ఎలా?

కొత్తగా నాటిన అరటి తోటల్లో కలుపు నివారణ చాలా ముఖ్యం. దీని కోసం హెక్టారుకు 500 లీటర్ల నీటిలో బుటాక్లోర్ 5L లేదా అలాక్లోర్ 2.5L లేదా పెండిమెథాలిన్ 2.5లీటర్లలో ఏదో ఒక మందును కలిపి నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. దీని వల్ల కలుపు మొలవకుండా అరికట్టవచ్చు. 100 మైక్రానుల మందం కలిగిన పాలిథీన్ మల్చింగ్ షీటును నేలపై పరచి ఆ తర్వాత మొక్కనాటితే కలుపు సమస్యను అధిగమించవచ్చు.
News December 30, 2025
రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్!

రష్మిక, విజయ్ దేవరకొండ కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఈ సెలబ్రిటీలు పెళ్లి చేసుకోనున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని సమాచారం. కాగా దీనిపై హీరోహీరోయిన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు.
News December 30, 2025
ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలపై బ్యాంకర్లు దృష్టి సారించాలి: అ. కలెక్టర్

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల విజయవంతానికి బ్యాంకర్లు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో మాట్లాడారు. రెండో త్రైమాసికం ముగిసే నాటికి జిల్లాలో ప్రాధాన్యత రంగం కింద నిర్దేశించుకున్న రుణ పంపిణీ లక్ష్యంలో 54.15 శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు. మిగిలిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కోరారు.


