News May 2, 2024

మూడేళ్లలో నెల్లూరు విమానాశ్రయం: లోకేశ్

image

నెల్లూరు జిల్లా రాజకీయాలు విమానాశ్రయం చుట్టే తిరుగుతున్నాయి. జిల్లా కోసమే ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిన వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఇదే విషయాన్ని కీలకంగా ప్రస్తావించారు. తాజాగా నిన్న వీఆర్సీ మైదానంలో జరిగిన యువగళం సభలో నారా లోకేశ్ ఎయిర్ పోర్టుపై కీలక హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే విమానాశ్రయం తీసుకు వస్తామని చెప్పారు. మరి నాయకుల హామీలపై మీ కామెంట్.

Similar News

News October 19, 2025

నెల్లూరు జనసేన వివాదంపై త్వరలో విచారణ!

image

నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఇటీవల ఏర్పడిన వివాదాలపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్‌గా దృష్టి సారించారు. జిల్లా ముఖ్య నేత, టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్‌పై కొందరు నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. పార్టీ సీనియర్ నాయకులను కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పార్టీ రాష్ట్ర MSME ఛైర్మన్ శివశంకర్‌ను విచారణకు పంపనున్నారు.

News October 19, 2025

అధిష్ఠానం ముందుకు.. నెల్లూరు టీడీపీ నేతల వ్యవహారం!

image

నెల్లూరులో పెద్ద దుమారం రేపిన రేషన్ మాఫియా వ్యవహారం TDP అధిష్ఠానం వద్దకు చేరుకుంది. నెల్లూరులో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీలను ఇటీవల పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమాలపై నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి ద్వజమెత్తిన విషయం తెలిసిందే. అదే పార్టీకి చెందిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి రేషన్ మాఫియా వెనుక ఉన్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ క్రమంలో నుడా చైర్మన్, మరో నేత విజయవాడకు వెళ్లినట్టు సమాచారం.

News October 18, 2025