News December 17, 2025

మూడో విడత.. మహబూబాబాద్ జిల్లాలో తొలి ఫలితం

image

మరిపెడ మండలం ఎల్లారిగూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన బానోతు శాంతి మల్సూర్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 240 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Similar News

News December 17, 2025

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి చేయండి: MP

image

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి చేయాలని భారత రైల్వే బోర్డు ఛైర్మన్ సంతోశ్ కుమార్‌ను ఢిల్లీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. బుధవారం ఆయన్ను MP మర్యాదపూర్వకంగా కలిశారు. బిట్రగుంట అభివృధ్ధి, ROB, RUBల పూర్తి, వివిధ ప్రాంతాల్లో ప్రధాన ట్రైన్లకు హాల్టింగ్ ఏర్పాటుపై చర్చించారు. జిల్లాలో రైల్వే పరిధిలో పెండింగ్లో ఉన్న అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.

News December 17, 2025

నాగర్‌కర్నూల్‌లో 83.1 శాతం పోలింగ్‌

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఉత్సాహంగా ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 83.1 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 1,79,464 మంది ఓటర్లకు గాను 1,49,222 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అచ్చంపేట, ఉప్పునుంతల, చారకొండ మండలాల్లో భారీగా ఓటింగ్ జరగ్గా, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 1 గంటకే 77.82 శాతం పోలింగ్‌ పూర్తి కావడం విశేషం.

News December 17, 2025

వీర్నపల్లి సర్పంచ్‌గా జ్యోత్స్న విక్టరీ

image

వీర్నపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్ విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన సమీప అభ్యర్థి భూత భాగ్యలక్ష్మీపై జ్యోత్స్న గెలుపొందారు. బరిలో ఏడుగురు పోటీపడగా 205 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ సందర్భంగా జ్యోత్స్న మాట్లాడుతూ.. ఈ గెలుపును తన వ్యక్తిగత విజయంగా కాకుండా గ్రామప్రజలందరి విజయంగా భావిస్తున్నానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఆదరించిన గ్రామస్థులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.