News February 11, 2025

మూడో విడత రైతు భరోసా విడుదల

image

యాదాద్రి జిల్లాలో రైతులకు ప్రభుత్వం మూడో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఇప్పటి వరకు 9,151 మంది రైతుల ఖాతాలో రూ. 7,18,36,017 నిధులు జమచేసింది. గత నెల 26న మొదటి, ఈ నెల 5న రెండో విడత నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

Similar News

News November 6, 2025

జుట్టుకు రంగు వేస్తున్నారా?.. జాగ్రత్త!

image

పదేపదే హెయిర్ డై లేదా కలరింగ్ చేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుందని ముంబై హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ అభిషేక్ పిలానీ హెచ్చరించారు. ‘తరచుగా రంగులు వేయడం వల్ల జుట్టులోని కెరాటిన్ దెబ్బతిని పెళుసుగా మారడం, చివర్లు చిట్లడం జరుగుతుంది. అమోనియా, పెరాక్సైడ్ వంటి తీవ్రమైన రసాయనాలు జుట్టుకు శాశ్వత నష్టం కలిగిస్తాయి. జుట్టు రాలడం, పలుచబడటం వంటి సమస్యలు తీవ్రమవుతాయి’ అని పేర్కొన్నారు.

News November 6, 2025

పోష్, పోక్సో చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ఇన్చార్జ్ కలెక్టర్

image

పోష్ చట్టం-2013, పోక్సో చట్టం-2012లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ శ్రీజ అన్నారు. గురువారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగ స్థలాల్లో మహిళల రక్షణకు పోష్ చట్టం పొందించబడిందని, దీని కింద 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని సూచించారు. పిల్లల రక్షణకు పోక్సోలో కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు.

News November 6, 2025

KMR: మిడ్ డే మీల్స్ పెండింగ్ బిల్లులను చెల్లించాలని వినతి

image

పెండింగ్‌లోని బిల్లులను వెంటనే విడుదల చేయాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు డిమాండ్ చేశారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. MDM నిర్వహణ కమిటీ అధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకానికి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు రూ.8 కోట్లు పెండింగ్ బకాయిలు విడుదల కావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు.