News January 25, 2025
మూడో స్థానంలో కృష్ణా జిల్లా
సాయుధ దళాల పతాక నిధి సేకరణలో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందని జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి సర్జన్ లెఫ్ట్నెంట్ కల్నల్ డాక్టర్ కె. కళ్యాణ వీణ శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించి డిసెంబర్‌లో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా మెమెంటో తీసుకోవాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం రద్దు కావడంతో ఆ మెమెంటోను శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీని కలిసి అందజేశారు.
Similar News
News January 26, 2025
కృష్ణా జిల్లాలో నేడు ఆ రెండు బంద్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం మద్యం, మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. తిరిగి సోమవారం ఉదయం తెరుచుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం, మాంసం విక్రయించే దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశాయి. నేడు ఆదివారం కావడంతో మందు, ముక్కతో వీకెండ్‌ను ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని పలువురు అంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
News January 26, 2025
కృష్ణా జిల్లా కలెక్టర్‌కు అవార్డు
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డును కైవశం చేసుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. గత ఏడాది కృష్ణాజిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిగా 2024 సార్వత్రిక ఎన్నికలను సమర్ధవంతంగా పూర్తి చేశారు.
News January 25, 2025
గన్నవరం హైవేపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్
గన్నవరం జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. 60 సంవత్సరాల వృద్ధుడు రోడ్డు దాటుతుండగా లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వృద్ధుడు లారీ చక్రాల కిందపడి స్పాట్‌లోనే మృతి చెందాడు. గన్నవరం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.