News July 30, 2024
మూసీకి జలకళ.. 642.5 అడుగులకు పెరిగిన నీటిమట్టం

నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్ద జలాశయంగా ఉన్న మూసీ రిజర్వాయర్ నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతోంది. మూసీ ఎగువ ప్రాంతాలైన రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు, ఎగువ కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల ద్వారా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ ఏడాది వానాకాలం ప్రారంభం నుంచే మూసీ ప్రాజెక్టు జలాశయం నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. సోమవారం రాత్రి వరకు 642.5 అడుగులకు పెరిగింది.
Similar News
News February 22, 2026
NLG: ఈనెల 27 వరకు పెన్షన్ల పంపిణీ: డీఆర్డీవో

ఆసరా పింఛన్లను 27వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీవో శేఖర్ రెడ్డి తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళలకు చేయూత, ఆసరా పింఛన్లను ఆయా పోస్టాఫీసులలో అందజేయనున్నట్లు తెలిపారు. పింఛనుదారులు పింఛను మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ కార్యాలయాల్లో పొందాలని, దళారులను నమ్మవద్దని పేర్కొన్నారు.
News February 22, 2026
నల్గొండలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

నల్గొండ జిల్లాలో ఈ నెల 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 48 కేంద్రాలలో మొత్తం 27,905 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని జిల్లా ఇంటర్ అధికారి దస్రు నాయక్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించారు.
News February 21, 2026
నల్గొండ: పాఠశాలల్లో కంప్యూటర్ల రిపేర్లకు కోటేషన్ల ఆహ్వానం!

జిల్లాలోని 200 ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఐఎఫ్‌పీ స్క్రీన్ల మరమ్మతుల కోసం సమగ్ర శిక్షా విభాగం కోటేషన్లను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల సంస్థలు ఈ నెల 23 నుంచి మార్చి 2వరకు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. మార్చి 3న కలెక్టరేట్‌లో ఈ కోటేషన్లను తెరుస్తారని ఆయన పేర్కొన్నారు.


