News April 3, 2025
మూసీకి పూడిక ముప్పు..!

మూసీ జలాశయానికి పూడిక ముప్పు ముంచుకొస్తోంది. సీడబ్లూసీ గతేడాది నిర్వహించిన సర్వే మూసీకి పూడిక ముప్పును గుర్తించింది. ప్రాజెక్ట్ నిర్మించిన తొలినాళ్లలో నాలుగు నియోజకవర్గాల్లోని 42 వేల ఎకరాలకు పైగా సాగు నీరు, సూర్యాపేట పట్టణానికి తాగునీరు అందించింది. పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నేడు 30 వేల ఎకరాలకు కూడా సాగు నీటిని అందించలేని దుస్థితికి చేరుకుంది.
Similar News
News November 9, 2025
‘హైడ్రా నా అస్త్రం.. పేదల ఇళ్లు కూల్చేయడమే నాకిష్టం’

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా యూసుఫ్‌గూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ నగరంలో హైడ్రా చేసిన విధ్వంసాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా వీడియోలతో చూపించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో ఓ వ్యక్తి ‘హైడ్రా నా అస్త్రం.. పేదల ఇళ్లు కూల్చేయడమే నాకిష్టం’ అని రేవంత్ ఫొటోతో ఉన్న బ్యానర్ ప్రదర్శించారు.

అనకాపల్లి: సముద్ర తీర ప్రాంతాల్లో సందడి వాతావరణం

అనకాపల్లి జిల్లాలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. పరవాడ, అచ్యుతాపురం, ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాల్లోని ఉన్న తీరప్రాంతాలలో వేలాది మంది పర్యాటకులు సముద్ర స్నానాలు ఆచరించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తీర ప్రాంతాలలో విహారయాత్ర చేపట్టి, ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. దీంతో పిక్నిక్ స్పాట్‌లు కళకళలాడాయి.