News April 4, 2024
మూసీ నదిపై GHMC కీలక నిర్ణయం

HYDలోని మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల పరిధిలో నిర్మాణం, లే అవుట్ అనుమతులను నిలిపివేయాలని GHMC నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వేర్వేరు సంస్థల ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులను అనుమతించొద్దని ఉప కమిషనర్లు, ప్రణాళిక అధికారులకు తెలుపుతూ వెంటనే ఆదేశాలను అమలు చేయాలని తెలియజేశారు. మూసీ మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్‌లో భాగంగా చర్యలకు ఉపక్రమించారు.
Similar News
News December 16, 2025
10 నిమిషాల వీడియో కావాలా? HYDలో కొత్త దందా!

‘మీకు 10 నిమిషాల ఆ వీడియో కావాలా? జస్ట్ రూ.200. 30 నిమిషాల లైవ్ చాట్ రూ.300. 2 గంటల లైవ్ అశ్లీల వీడియో చాట్ రూ.500. కింద కనిపిస్తున్న అమ్మాయిల నంబర్లకు కాల్ చేయండి.’ అంటూ SMలో కొత్త దందా మొదలైంది. ముందుగా డబ్బులు పంపి, ఆ స్క్రీన్ షాట్ సెండ్ చేయాలని కండీషన్ పెడుతారు. టెంప్ట్ అయ్యి ఆ పని చేయకండి. ఆ తరువాత వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని HYD పోలీసులు సూచించారు.
News December 16, 2025
HYDలో KCR మీటింగ్ వాయిదా

ఈ నెల 19న జరగాల్సిన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాన్ని 21వ తేదీకి వాయిదా వేశారు. 19న పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు సమావేశంలో పాల్గొనేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ స్పష్టంచేశారు.
News December 16, 2025
IDPL ల్యాండ్స్ వివాదంపై సర్కారు విచారణకు ఆదేశం

IDPL ల్యాండ్స్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4000 కోట్ల రూపాయల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంచలనంగా మారిన ఈ వివాదంలో తాజాగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత పరస్పరం భూకబ్జా ఆరోపణలు చేసుకున్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనీ సర్వే నెంబర్ 376లో జరిగిన భూవివాదాలపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.


