News October 22, 2024

‘మూసీ ప్రక్షాళన చేస్తే నల్గొండ ప్రజలకు మేలు’

image

మూసీ ప్రక్షాళన చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో మూసీ పునరుజ్జీవన కోసం ప్రజాప్రతినిధులతో కలిసి సన్నాహక సమావేశ నిర్వహించి మాట్లాడారు. ప్రతి మండలంలో మూసీ ప్రక్షాళనపై ప్రజలకు కాంగ్రెస్ నేతలు తెలియపరచాలని, మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించాలన్నారు.

Similar News

News November 5, 2025

NLG: ఇంటర్ కళాశాలపై నిఘా…..!

image

జిల్లాలో సర్కారు, ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై ఇంటర్ బోర్డు నిఘా పెట్టింది. సర్కారు కళాశాలల్లో ఇప్పటికే ప్రక్షాళన చేసిన ప్రభుత్వం ఆచరణలో క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనానికి చర్యలు చేపట్టింది. దీంతో పాటు వేలల్లో ఫీజులు చెల్లిస్తున్న ప్రైవేట్ కళాశాలల్లో విద్యాబోధన, మౌలిక వసతులు తదితర అంశాలపై తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలోని 140 కళాశాలలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.

News November 5, 2025

శివ నామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు

image

నల్గొండ జిల్లాలో కార్తీక మాసం కొనసాగుతుంది. దీంతో ఈ మాసంలో ప్రతి రోజు అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాలకు భక్తులు తరలివెళ్తున్నారు. జిల్లాలో చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామీ, పానగల్ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానంతో పాటు వివిధ ఆలయాలకు భక్తులు ఉదయమే పెద్ద ఎత్తున చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఆలయాలు దీపాల కాంతులతో, శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.

News November 5, 2025

NLG: 4400 క్వింటాళ్ల పత్తి కొనుగోలు

image

నల్గొండ జిల్లాలో 23 జిన్నింగ్ మిల్లుల పరిధిలో L-1 కింద ఉన్న 9 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్లు మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి తెలిపారు. ఇప్పటివరకు 4400 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుంచి 12% తేమ ఉండడంతో పాటు కపాస్ కిసాన్ అనే యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు మాత్రమే స్లాట్ ఆధారంగా పత్తిని కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకురావాలని సూచించారు.