News February 26, 2025

మృతదేహాలు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

image

తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం అంతా మహా శివరాత్రి పర్వదినాన ఆ గ్రామం అంతా విషాదంతో నిండిపోయింది. నది స్థానానికి దిగిన 11 మందిలో ఐదుగురు గల్లంతయి మృత్యువాత పడ్డారు. దీంతో కలెక్టర్ ప్రశాంతి ఉదయం నుంచి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయంతో వెలికితీసిన మృతదేహాలను పంచనామా నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News February 26, 2025

ధవళేశ్వరం: స్నేహబంధం.. ఇలా చెదిరిపోయింది

image

వారిద్దరిది ఒకే ఊరు.. ఒకే ప్రాంతం. పక్క పక్కనే ఇళ్లు, ఒకరిని వదిలి ఒకరు ఉండలేని స్నేహబంధం వారిది. అయితే మృత్యువు రూపంలో ఆ బంధం చెదిరిపోయింది. వివరాలు ఇలా.. ధవళేశ్వరం జాలరి పేటకు చెందిన ప్రాణ స్నేహితులు నాగమళ్ల ముత్యాలు(19), బొడ్డు వెంకటేష్ (16) మంగళవారం బైక్‌పై వెళుతూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో స్పాట్‌లోనే మరణించారు. ఈ దుర్ఘటన చూసిన వారు స్నేహబంధం ఇలా విడిపోయిందంటూ కన్నీరు పెట్టుకున్నారు.

News February 26, 2025

27న విద్యాసంస్థలకు సెలవు: డీఈఓ

image

ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా కమిషనర్‌ సెలవు ప్రకటించినట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులకు, ఎంఈఓలు, అన్ని విద్యా సంస్థలకు దీనిపై సర్క్యులర్ అందించినట్లు వివరించారు.

News February 26, 2025

తూ.గో: జిల్లాలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్లు 62,970

image

ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో తూ.గో జిల్లాలో 62,970 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి మంగళవారం ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 27న జరగనున్న ఎన్నికలకు 92 పోలింగ్ కేంద్రాలను 15 రూట్‌లలో ఏర్పాటు చేశామన్నారు. మొత్తం ఓటర్లలో పురుషులు 36,366 మంది, స్త్రీలు 27,601 మంది ఇతరులు ముగ్గురు ఉన్నారన్నారు.

error: Content is protected !!