News February 6, 2026

మృతుడు మైలారం వాసి.. UPDATE

image

వెంకటాపూర్ మండలం వెలుతుర్లపల్లి క్రాస్ వద్ద గురువారం రాత్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం విధితమే. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు జయశంకర్ జిల్లా గణపురం మండలం మైలారం గ్రామానికి చెందిన రాజుగా స్థానికులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన బండి నిఖిల్(మైలారం), ఇండ్ల సుమన్(కనిపర్తి), రాపూరి రాజేష్(గుంటూరు)కు చెందినవారుగా సమాచారం.

Similar News

News February 6, 2026

పీయూలో స్కిల్ డెవలప్మెంట్‌పై ఆన్‌లైన్ సమావేశం

image

పాలమూరు విశ్వవిద్యాలయం అకాడమిక్ ఆడిట్ సెల్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థుల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంపై ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉపకులపతి ప్రొ.జి.ఎన్ శ్రీనివాస్ పాల్గొని, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించుకోవడం అవసరమని సూచించారు. రిజిస్ట్రార్ ప్రొ. పి.రమేష్ బాబు, అకాడమిక్ డైరెక్టర్ చంద్ర కిరణ్, అన్ని డిగ్రీ కాలేజీల ప్రిన్సిపల్స్‌ పాల్గొన్నారు.

News February 6, 2026

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు: ఎస్పీ

image

మద్యం మత్తులో జరిగిన గొడవలో వ్యక్తిని హత్య చేసిన నిందితుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. గడిపేద్దపూర్‌కు చెందిన మహేష్.. యాదయ్యపై కర్రతో దాడి చేసి చంపాడు. దీనిపై అలాదుర్గం పోలీసులు దర్యాప్తు చేసి సాక్ష్యాలను ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కేసును సమర్థంగా దర్యాప్తు చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News February 6, 2026

వేటపాలెంలో తప్పిపోయిన ముగ్గురు బాలికల గుర్తింపు

image

ముగ్గురు చిన్నారులు తప్పిపోయి వేటపాలెం హైవే పై తిరుగుతుండగా శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ వద్ద వారిని ఎస్ఐ విచారించగా నెల్లూరు హోమ్ నుంచి వారు పారిపోయి వచ్చినట్లు చెబుతున్నారు. ముగ్గురు బాలికలు వేటపాలెం పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల సంరక్షణలో ఉన్నారన్నారు. వారి వివరాలు తెలిసినవారు వేటపాలెం ఎస్సై, చీరాల రూరల్ సీఐను సంప్రదించాలని కోరారు.