News September 10, 2025
మెంటాడ: పురుగుమందు తాగి ఆత్మహత్య

మెంటాడ మండలం గుర్ల గ్రామంలో మద్యానికి బానిసైన కుమిలి సంతోశ్ మంగళవారం రాత్రి పురుగుమందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆసుపత్రిలో చేర్చామన్నారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆండ్ర ఎస్‌ఐ సీతారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News September 10, 2025
VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

విజయనగరం మండలం రీమా పేట సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీ.టీ.అగ్రహారానికి చెందిన సిమ్మ రాము(50) మృతి చెందాడు. మృతుడు బండిపై ఐస్‌లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. బుధవారం ఐస్‌లు అమ్ముకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై రూరల్ ఎస్‌ఐ వి.అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 10, 2025
VZM: ‘నేపాల్‌లో జిల్లా యాత్రికులు సురక్షితం’

విజయనగరం జిల్లా నుంచి మానస సరోవర యాత్రకు వెళ్లిన 61 మందీ క్షేమంగా ఉన్నారని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. వీరిని సురక్షితంగా జిల్లాకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. యాత్రికులతో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనిత స్వయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారని, వారిని రప్పించేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. మంత్రి లోకేశ్‌కు జిల్లాకు చెందిన యాత్రికులు 61 మంది జాబితాను పంపించామన్నారు.
News September 10, 2025
VZM: ఉమ్మడి జిల్లా న్యాయవాదులతో వీడియో కాన్ఫెరెన్స్

విజయనగరం జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి బబిత ఉమ్మడి జిల్లా న్యాయవాదులతో బుధవారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. వచ్చేనెల 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను న్యాయవాదులు విజయవంతం చేయాలని సూచించారు. రాజీకు వచ్చే ప్రమాద బీమా క్లెయిమ్ కేసులు, అన్ని సివిల్ దావాలు, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, బ్యాంకు, తదితర కేసులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.