News December 30, 2025
మెండోరా: ట్రాక్టర్ ఢీకొని టీచర్ మృతి

మెండోరా మండలం పోచంపాడ్ సమీపంలో తెలంగాణ సొషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌లో టీచర్‌గా పని చేస్తున్న ప్రియాంక ట్రాక్టర్ ఢీకొని మృతి చెందినట్లు ఎస్ఐ సుహాసిని తెలిపారు. బైక్ మీద వెళ్తుండగా వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టిందన్నారు. చికిత్స నిమిత్తం నిర్మల్ హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారన్నారు
Similar News
News February 18, 2026
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

నందిపేట్ మండల కేంద్రంలో నిర్మిస్తోన్న భవిత సెంటర్‌ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. పనులను వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాంపు వంటి వసతులు తప్పనిసరిగా ఉండాలన్నారు.
News February 18, 2026
నిజామాబాద్: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఫకీరాబాద్ సమీపంలో బైక్ యాక్సిడెంట్ జరిగి గణపతి అనే వ్యక్తి మరణించాడని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 9న సాయంత్రం బైక్‌పై బోధన్ నుంచి బాసర వెళ్తుండగా మార్గమధ్యలో ఫకీరాబాద్ సమీపంలో బైక్ స్కిడ్ అయి తీవ్రంగా గాయపడ్డారన్నారు. అనంతరం గణపతి నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారని చెప్పారు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
News February 18, 2026
NZB: వార్షిక పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

10వ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. ఎలాంటి లోటుపాట్లను తావులేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.


